Indian Express Power List 2025 : సీఎం రేవంత్‌రెడ్డి అంటే లోకల్ అనుకుంటివా. లే. నేషనల్. తెలంగాణలో సౌండ్ చేస్తే.. దేశమంతా రీసౌండ్ రావాలె. అట్లుంటది రేవంత్‌తోని. దేశంలోకే అత్యంత శక్తివంతుల్లో ఒకరిగా నిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి. 2025 ఏడాదికి గాను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిలీజ్ చేసిన 100 మంది అత్యంత శక్తివంతుల జాబితాలో 28వ స్థానంలో నిలిచారు. గత ఏడాది 39 వ ర్యాంకులో ఉండగా.. ఈసారి 11 స్థానాలు ఎగబాకి.. 28th ర్యాంక్‌తో ముందుకొచ్చారు. తెలంగాణలో ప్రజాపాలనతో పాటు.. బీసీ కులగణన, డీలిమిటేషన్ వ్యతిరేక పోరాటం.. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వారిని కోటీశ్వరులను చేయడం.. ఉచిత కరెంట్.. ఇలా అనేక సంక్షేమ పథకాలతో తన మార్కును బలంగా చాటుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అందుకే ఇప్పుడు రేవంత్ పేరు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. అత్యంత శక్తివంతుల్లో 28వ స్థానంలో నిలబెట్టింది.
చంద్రబాబు లీడింగ్..
ఇక, మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పేదేముంది. ఆయన జగమెరిగిన గ్లోబల్ లీడర్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ర్యాంకింగ్‌లో 14వ స్థానంలో నిలిచారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏఐ, డ్రోన్ టెక్నాలజీ.. P4 పాలసీలు.. అమరావతి పనులతో.. ర్యాంకింగ్‌లో దూసుకుపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం 100 మంది జాబితాలో పవర్‌ఫుల్ లీడర్‌గా నిలబడ్డారు. జనసేనానికి 73వ ర్యాంక్ వరించింది. అటు, పుష్ప మూవీ క్రేజ్‌తో హీరో అల్లు అర్జున్ సైతం 92 ర్యాంక్ పొందడం విశేషం.
టాప్ 10 లో ఎవరెవరంటే..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిలీజ్ చేసిన 100 మంది జాబితాలో ప్రధాని మోదీ అందరికంటే టాప్‌లో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నెంబర్ 2లో నిలిచారు. విదేశాంగ మంత్రి జయశంకర్, మోహన్ భగవత్, నిర్మలా సీతారామన్, యూపీ సీఎం ఆదిత్యానాథ్, రక్షణమంత్రి ఆదిత్యానాథ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలు ఆ తర్వాత వరుసగా మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి 81వ ర్యాంక్.. మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీకి 89 ర్యాంక్ వచ్చింది.
క్రికెటర్లు, సినీ తారల ర్యాంకులు..
స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఈ జాబితాలో 48 వ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 72 ర్యాంక్‌కు పరిమితమయ్యారు. బాలీవుడ్ నుంచి హీరో షారుక్ ఖాన్‌కు 97, అమితాబ్ బచ్చన్ 99, హీరోయిన్ అలియా భట్ 100 ర్యాంక్‌తో లిస్ట్‌లో చివరన ఉన్నారు.