BigTV English

Vijay Devarakonda: అర్జునుడిగా ‘అర్జున్ రెడ్డి’ సెట్ కాలేదని ట్రోలింగ్..తనదైన స్టైల్‌లో డీల్‌ చేసిన రౌడీస్టార్

Vijay Devarakonda: అర్జునుడిగా ‘అర్జున్ రెడ్డి’ సెట్ కాలేదని ట్రోలింగ్..తనదైన స్టైల్‌లో డీల్‌ చేసిన రౌడీస్టార్

Vijay Devarakonda in kalki movie(Latest news in tollywood): సినీ పరిశ్రమను ‘కల్కి 2998 ఏడీ’ షేక్ చేసింది. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.415 కోట్లు వసూలు చేసి బాక్సాపీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.


కల్కిలో మహాభారతం ఎపిసోడ్ ఉందనే విషయం తెలిసిందే. అయితే ఇందులో అర్జునుడిగా రౌడీస్టార్ విజయ్ దేవరకొండ నటించారు. తన పాత్రపై విజయ్ దేవరకొండ ఇటీవల మాట్లాడారు. నాగీ, ప్రభాస్ అన్న కోసం ఆ పాత్ర చేశానని వెల్లడించారు. తాను అర్జునుడిగా నటిస్తే..ప్రభాస్ కర్ణుడిగా నటించారన్నారు. అయితే స్క్రీన్‌పై విజయ్, ప్రభాస్‌గా చూడొద్దని..అర్జునుడిగా, కర్ణుడిగా మాత్రమే చూడాలని సూచించారు. తాజాగా, అర్జునుడి పాత్రపై నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

అర్జునుడి పాత్రలో విజయ్ సెట్ కాలేదని, అతను చెప్పిన డైలాగ్స్ తెలగాణ స్లాంగ్‌లో ఉన్నాయని సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ విషయం కాస్త విజయ్ దేవర కొండ వరకు చేరింది. దీనిపై విజయ్.. తనదైన స్టైల్‌లో డీల్ చేశారు. ‘కల్కి 2998 ఏడీ’సినిమాలో తాను పోషించిన అర్జునుడి పాత్ర ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలోని తన అకౌంట్స్ హ్యాండిల్‌కు డీపీలుగా మార్చాడు. ఇలా తనను ట్రోల్ చేసిన వారికి పరోక్షంగా విజయ్ దేవరకొండ కౌంటర్ ఇచ్చాడు.


విజయ్ దేవరకొండ సినిమాలతోపాటు ఆయనపై ఇటీవల ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ గతంలో నటించిన ‘ప్యామిలీస్టార్’ సమయంలో ఐరన్ వంచాలా ఏంటీ? అనే డైలాగ్ బాగా ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత సినిమా విడుదలైన తర్వాత ఆ సన్ని వేశాలను ఉద్దేశించి మళ్లీ ట్రోలింగ్ జరిగింది. ఈట్రోలింగ్ లను ఆయుధంగా ప్రమోషన్స్ కు వాడుకున్నాడు.

తాజాగా, కల్కి విషయంలోనూ అదే జరిగింది. విజయ్ లోని ఈ అగ్రెసిస్ ఇంటెంట్‌యే అతన్ని ఫ్యాన్స్‌లో రౌడీస్టార్ ను చేసింది. గతంలో విజయ్ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమి ఈవెంట్‌లో ఓ రాజకీయ నేతను ఉద్దేశించి కౌంటర్ ఎటాక్ చేసిన విజయ్ ని ఎవరూ మర్చిపోరు.

విజయ్..ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా లేదా స్పై పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొస్తుంది. దీంతోపాటు గతంలో ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. అలాగే రవికిరణ్ కోల దర్శకత్వంలో ఓ పక్కా విలేజ్ మాస్ డ్రామాకు విజయ్ కమిటయ్యాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉంది.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×