Tollywood..ఈ ఏడాది మొదలయ్యి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే పలువురు సెలబ్రిటీల మరణాలు అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈరోజు ఉదయం హాలీవుడ్ సింగర్ ఫ్లాక్ (Flack ) మృతిచెందగా.. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత కేదార్ (Kedar) మృతి చెందారు. ‘గంగం గణేశా’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఈయన.. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే సమస్య మరింత తీవ్రతరం కావడంతో ఈరోజు మధ్యాహ్నం దుబాయిలో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. గత కొంతకాలంగా దుబాయ్ లో నివాసం ఉంటున్న కేదార్ కు ఒక కూతురు కూడా ఉంది.ప్రస్తుతం ప్రొడ్యూసర్ కేదార్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతి చిన్న వయసులోనే మరణించడంతో మరింత దుఃఖితులవుతున్నారు. ఇకపోతే కేదార్ మరణంపై కుటుంబ సభ్యులు ఇంకా స్పందించాల్సి ఉంది.
విజయ్ దేవరకొండ మూవీ ఆగినట్టేనా..?
ఇకపోతే ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా రాబోతున్న చిత్రానికి కేదార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు వీరి కలయికలో రాబోయే చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ కి కేదార్ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పుడు నిర్మాత మరణించడంతో విజయ్ దేవరకొండ మూవీని ఎవరు టేకోవర్ చేసుకుంటారు..? ఇక అసలు ఎవరైనా ముందుకు వస్తారా? ఈ సినిమా ఆగినట్టేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అల్లు అర్జున్ ప్రాణ స్నేహితుడు కూడా..
నిర్మాత కేదార్ అల్లు అర్జున్ (Allu Arjun)కి ప్రాణ స్నేహితుడు కూడా.. ముఖ్యంగా అల్లు అర్జున్ సపోర్ట్ తోనే కేదార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు బన్నీ వాసు(Bunny vasu) అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టిన కేదార్.. విజయ్ దేవరకొండ తమ్ముడు ప్రముఖ హీరో ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) తో ‘గంగం గణేశా’ సినిమా చేసి నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నారు. కేదార్ అటు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లకు మంచి మిత్రుడుగా కూడా పేరు సొంతం చేసుకున్నారు కేదార్. ఇప్పుడు కేదార్ మరణించారని తెలిసి అటు సినీ సెలబ్రిటీలు కూడా దుఃఖంలో మునిగిపోయారు.
పెళ్లికి వెళ్ళాడా? లేక మ్యాచ్ కోసం వెళ్ళాడా?..
ఇదిలా ఉండగా దుబాయ్ లో ఒక బడా నిర్మాత కొడుకు పెళ్లి ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుండి చాలామంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan), ఆయన సతీమణి ఉపాసన (Upasana), ఎన్టీఆర్(NTR ) ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranathi), మహేష్ బాబు(Mahesh Babu)భార్య నమ్రత (Namrata) ,వారి కూతురు సితార(Sitara)తో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. ఇకపోతే పెళ్లి కోసం దుబాయ్ వెళ్లినవారు ఆ పెళ్లి చూసుకొని ప్రస్తుతం కొంతమంది వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటే.. ఇంకొంతమంది తిరిగి వచ్చారు. అయితే కేదార్ ఆ వివాహానికి వెళ్ళారా? లేక ఇటీవల జరిగిన పాక్ – ఇండియా మ్యాచ్ కోసం వెళ్లారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి అయితే కేదార్ మరణం అక్కడ అందర్నీ మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక అక్కడే ఉన్నవారు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. మరికొందరు ఆయన మృతదేహాన్ని చూడడానికి వెళుతున్నట్లు సమాచారం.