Sankranthiki Vastunnam: కొంతమంది ట్రెండ్ సెట్ చేస్తారు.. ఇంకొంతమంది ఆ ట్రెండ్ ను ఫాలో అవుతారు. ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ను ఒకరు స్టార్ట్ చేశారు అంటే.. అదే అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ గోల ఎందుకు అంటే.. పుష్ప 2 సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో..అందరికీ తెల్సిందే. ఆ సినిమానే పెద్ద ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఏ విషయంలో అంటే.. ఓటీటీలోకి ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. థియేటర్ లో కట్ చేసిన సీన్స్ ను యాడ్ చేసి స్ట్రీమింగ్ చేయడం మొట్ట మొదటిసారి పుష్ప 2 కే జరిగింది.
ఇక ఈ ట్రెండ్ టాలీవుడ్ లో నడుస్తూనే ఉంది. థియేటర్ లో నిడివి ఎక్కువ వలన కట్ చేసిన సీన్స్ ను యాడ్ చేసి ఓటీటీలో వదిలేస్తున్నారు. ఎందుకంటే ఓటీటీలో ఎంతసేపు అయినా ప్రేక్షకులు చూస్తారు కాబట్టి. థియేటర్ లో మూడు గంటలు చూడడానికి ఇష్టపడని ప్రేక్షకులు.. ఇంట్లో కుటుంబంతో కలిసి నాలుగు గంటల సినిమాను చూడమన్న చూస్తారు. అందుకే కొత్తగా మేకర్స్.. డిలీట్ చేసిన సీన్స్ ను కూడా యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కూడా మేకర్స్ ఇదే పని చేసినట్లు తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీరిద్దరూ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ను దిల్ రాజు నిర్మించాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఈ సినిమా.
Iswarya Menon : ఐశ్వర్య మీనన్ సోయగాలు చూశారా.. రెండు కళ్లు చాలట్లేదు మామా..
అంతే కాకుండా వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలవడమే కాకుండా మొట్టమొదటిసారి వెంకీ మామను 100 కోట్ల క్లబ్లో చేర్చింది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న సంక్రాంతి వస్తున్నాం సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే అభిమానులకు షాక్ ఇచ్చేలాగా మేకర్స్ ఒక విషయాన్ని తెలియజేశారు.
మొదట ఓటీటీలో కన్నా టీవీలోనే సంక్రాంతికి వస్తున్నాం స్క్రీనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అభిమానులు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 1న సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ కి వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. దీంతో పాటు ఇంకో వార్త కూడా వైరల్ గా మారింది. అదేంటంటే థియేటర్లో సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్ రావిపూడి డిలీట్ చేశాడంట. ఇక ఓటీటీలో ఆ సన్నివేశాలను యాడ్ చేసి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.