BigTV English
Advertisement

Sundeep Kishan Mazaka: బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరీ ఇంత తక్కువా.? అయినా సందీప్‌కు సవాలే..

Sundeep Kishan Mazaka: బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరీ ఇంత తక్కువా.? అయినా సందీప్‌కు సవాలే..

Sundeep Kishan Mazaka: ఏ సినిమా అయినా హిట్ అయ్యిందా లేక ఫ్లాప్ అయ్యిందా అనేది తెలియాలంటే కలెక్షన్స్ లెక్కల ద్వారానే తెలుస్తుంది. ప్రేక్షకులంతా ఆ సినిమా ఎంత బాగుంది అని చెప్పినా కూడా కలెక్షన్స్ సరిపడా రాకపోతే దానిని ఫ్లాప్ లెక్కలోకే వేసేస్తారు ఇండస్ట్రీ నిపుణులు. అందుకే ప్రతీ మూవీకి బ్రేక్ ఈవెన్ అనేది చాలా ముఖ్యం. అలాగే యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా తన అప్‌కమింగ్ మూవీ ‘మజాకా’తో బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా ముఖ్యం. తన గత సినిమాలు బాగానే ఉన్నాయని ఆడియన్స్ చెప్పినా కూడా సరిపడా కలెక్షన్స్ రాకపోతే వాటిని ఫ్లాప్ అని తేల్చేశారు. కానీ ‘మజాకా’ విషయంలో అలా జరగకూడదంటే ఆ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాల్సిందే.


ఇన్‌సైడ్ టాక్ ఏంటంటే.?

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ (Sundeep Kishan) నటించిన సినిమానే ‘మజాకా’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బ్రేక్ ఈవెన్ వివరాలు బయటికొచ్చాయి. కేవలం రూ.11.5 కోట్ల కలెక్షన్స్ రాబడితే మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని తెలుస్తోంది. మామూలుగా సందీప్ కిషన్ లాంటి అనుభవం ఉన్న హీరోకు ఈ టార్గెట్ చాలా తక్కువ. కానీ ‘మజాకా’ లాంటి మూవీతో దీనిని సాధించగలడా అని ఇండస్ట్రీ నిపుణుల్లో సందేహం మొదలయ్యింది. ఈ మూవీ హిట్ అని సందీప్ చెప్తున్నా కూడా నిపుణుల్లో ఇలాంటి డౌట్స్ రావడానికి ‘మజాకా’ అందుకుంటున్న ఇన్‌సైడ్ టాకే కారణం.


పెయిడ్ ప్రీమియర్స్

కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా తెరకెక్కిన సినిమాలు హిట్ అవ్వాలంటే ప్రేక్షకులకు ముందుగా అవి బోర్ కొట్టకూడదు. కాస్త క్రింజ్, ఎక్కడైనా బోర్ కొట్టినట్టు ఉన్నా కూడా ప్రేక్షకులు ఆ సినిమాలకు అంతగా పాజిటివ్ రివ్యూ ఇవ్వరు. ప్రస్తుతం ‘మజాకా’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఫిబ్రవరి 26న ‘మజాకా’ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనుకుంటేనే మేకర్స్ ఈ పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఈ ప్రీమియర్స్‌లో మూవీకి కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కూడా మినిమమ్ కలెక్షన్స్ కూడా సాధించకుండా సినిమా ఫ్లాప్ అవుతుంది. ప్రస్తుతం ‘మజాకా’ యావరేజ్ అనే టాకే వినిపిస్తోంది.

Also Read: చిరంజీవితో ‘మజాకా’, కొడుకుగా ఆ యంగ్ హీరో.. చివరికి ప్లాన్ ఫెయిల్..!

బోరింగ్ సీన్స్

‘మజాకా’ (Mazaka)లో ప్రేక్షకులను బోర్ కొట్టించే సీన్స్ ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అక్కడక్కడా కామెడీ వర్కవుట్ అయినా కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఈ కామెడీ చాలా క్రింజ్ అని, సిల్లీ అని అనిపిస్తుందట. ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న ఇన్‌సైడ్ టాక్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ రూ.11.5 కోట్లే అయినా కూడా అది అందుకోవడం కష్టమే అని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ కిషన్ మాత్రం వీకెండ్ లోపు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని, ఆ నమ్మకం తనకు ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మొత్తానికి ఈ మూవీ రిజల్ట్ కాస్త అటు ఇటు అయినా సందీప్ కెరీర్‌ కష్టాల్లోకి వెళ్లిపోతుందని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×