BigTV English
Advertisement

VD12: విజయ్ దేవరకొండ ‘సామ్రాజ్యం’.. నిలబడుతుందా.. కుప్పకూలుతుందా.. ?

VD12: విజయ్ దేవరకొండ ‘సామ్రాజ్యం’.. నిలబడుతుందా.. కుప్పకూలుతుందా.. ?

VD12: ఏ ముహూర్తాన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేసాడో కానీ.. అప్పటినుంచి అతనికి ఒక మంచి హిట్ వచ్చింది లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సరే ఒక్క సినిమానే కదా అనుకుంటే.. ఆ తరువాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా  ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.  అర్జున్ రెడ్డి తరువాత విజయ్ కున్న యాటిట్యూడ్ అంతా  ఈ ప్లాప్స్  వలన తగ్గిపోయింది. ఒకప్పుడు ఉన్న విజయ్ వేరు.. ఇప్పుడు విజయ్ వేరు. అయితే యాటిట్యూడ్ తగ్గినా విజయ్ లో ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదు.


ఎలాగైనా మంచి హిట్ కొట్టి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఒక మంచి కథను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే VD12. జెర్సీ  సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. మళ్లీ రావా లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో టాలీవుడ్ కు పరిచయమైన గౌతమ్.. జెర్సీ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. ఇక జెర్సీ సినిమానే హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.

Actress : పెళ్లి, భర్త అవసరం లేదు… పిల్లలు మాత్రం కావాలంటున్న బిగ్ బాస్ బ్యూటీ


ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండతో VD12 చేస్తున్నాడు. మొదట  రామ్ చరణ్ కు ఒక స్పోర్ట్ కథ చెప్పడం.. వారిద్దరి కాంబోలో ఈ సినిమా అధికారికంగా ప్రకటించడం జరిగింది. కానీ, కొన్ని కారణాల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథను విజయ్ తో చేస్తున్నాడని టాక్ నడిచింది. అయితే ఆ కథ వేరు.. ఈ కథ వేరు అని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఈ సినిమాలో విజయ్ రెండు వేరు వేరు పాత్రల్లో కనిపించనున్నాడు.

ఒకటి పోలీస్ గా.. రెండు ఖైదీగా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సినిమాను ప్రకటించి ఇన్ని నెలలు అవుతున్నా.. ఇప్పటివరకు టైటిల్ ను  ప్రకటించింది లేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ VD12 ను నిర్మిస్తుండగా.. రౌడీ ఫ్యాన్స్ టైటిల్ రిలీజ్ చేయమని ఒకటే పోరు పెడుతున్నారు. ఈ పోరు తట్టుకోలేక  నాగవంశీ టైటిల్ రివీల్ చేయడానికి ముఖుర్థం కూడా ఖరారు చేశాడు. త్వరలోనే VD12 టైటిల్ ను రివీల్ చేస్తామని చెప్పుకొచ్చాడు.

ఇక ఈలోపే VD12 టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక పేరు హల్చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సామ్రాజ్యం అనే టైటిల్ ను ఖరారు చేశారట. తన సామ్రాజ్యం కోసం విజయ్ ఏం చేశాడు.. ? అనేది కథగా తెలుస్తోంది. టైటిల్ చాలా కొత్తగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఇదే టైటిల్ ఓకే అయితే కనుక విజయ్ కు మంచి టైటిల్ దొరికినట్టే అని చెప్పొచ్చు. మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాతో నిలబడతాడా.. ? మళ్లీ ప్లాప్ ను అందుకుంటాడా.. ? అనేది చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×