Chennai News: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. కుళ్లిపోయిన స్థితిలో తండ్రీ కూతుళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. డాక్టర్ సింథియా వద్ద చికిత్స తీసుకున్న శంకర్ అనే వ్యక్తి వైద్యం వికటించి మృతిచెందాడు. తన తండ్రికి సింథియానే కారణమని ఆయనను ప్రశ్నించిన కూతుర్ని డాక్టర్ చంపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మృతదేహాలు వాసన రాకుండా ఏసీ ఆన్ చేసి పెట్టడం గమనార్హం. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. నిందితుడు సింథియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వివరాల ప్రకారం. తండ్రి, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. ఐదు నెలల క్రితమే వీరు ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. అపార్ట్ మెంట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల స్థానికులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తండ్రి, కూతురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
అయితే.. తండ్రి కూతుళ్ల ఘటనలో అనుమానం ఉన్న సింథియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడుగా అనుమానిస్తున్న సింథియా, తండ్రి కూతుళ్లతో ఒకే ఇంట్లోఉన్నాడని.. మృతిచెందిన అమ్మాయితో ఎఫైర్ ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి ఇద్దరు మధ్య వాగ్వాదం జరగినట్లు సమాచారం. ఈ వాగ్వాదం ఎక్కువవ్వడంతో ఆమెను సింథియా తోసేయడంతో తల బలమైన గాయమై మరణించినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె తండ్రి అపార్ట్‌మెంట్ లోపలే మృతిచెంది ఉన్నాడు. అతడిని నిందితుడు చంపినట్లు అంగీకరించలేదు. అతను అనారోగ్యం కారణంగానే మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Vijayashanti – Balakrishna: పెళ్లి తర్వాత బాలకృష్ణ విషయంలో భర్త కఠిన నిర్ణయం.. అందుకే అలా చేసిందా..?
తండ్రి కూతుళ్ల మరణం తర్వాత అరెస్ట్ చేస్తారని భయపడిన నిందితుడు అక్కడ నుంచి వెంటనే పరారయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. తండ్రి కూతుళ్ల మృతదేహాలు నాలుగు నుంచి ఐదు నెలలుగా అపార్ట్ మెంట్‌లోనే ఉన్నాయి. కాంచీపురానికి చెందిన సింథియా వియన్నాలో మెడికల్ డిగ్రీ చేసాడని పోలీసులు తెలిపారు. వీరి మరణానికి సంబంధించి వాస్తవాలు.. ఎప్పుడు చనిపోయారో సమయాన్ని నిర్ణయించడానికి మృతదేహాలను అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.