BigTV English

Vijay Devarakonda : దేవరకొండ కాళ్లపై పడ్డ కేరళ అభిమాని… సినిమాలను మాత్రం హిట్ చేయరు

Vijay Devarakonda : దేవరకొండ కాళ్లపై పడ్డ కేరళ అభిమాని… సినిమాలను మాత్రం హిట్ చేయరు

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం కేరళలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా షూటింగ్లో భాగంగా కేరళకు వెళ్లిన విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ఆయన కాళ్లపై పడిన వీడియో వైరల్ అవుతుంది.


విజయ్ దేవరకొండ కాళ్ళపై పడ్డ అభిమాని…

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  హీరోగా, గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వీడి 12’ (VD12). ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, విజయ్ దేవరకొండ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా కేరళలో సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తి కాగా, ఆ తర్వాత విజయ్ ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఒక వీడియోలో అభిమాని విజయ్ దేవరకొండ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడం కనిపిస్తోంది. ఇక సదరు అభిమానిని విజయ్ దేవరకొండ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని పలకరించారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలు చూస్తుంటే రోజురోజుకూ అక్కడ కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ మరింతగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.


సినిమాలు హిట్ చేయరు

ఈ నేపథ్యంలోనే ఆ వైరల్ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ అల్లు అర్జున్ (Allu Arjun) తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కే కేరళలో ఇంతటి ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినప్పటికీ విజయ్ దేవరకొండ నటించిన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా కేరళలో కలెక్షన్లు మోత మోగించలేకపోయింది. కానీ ఇప్పుడేమో అభిమానులు కాళ్లపై పడి మరీ అభిమానాన్ని చూపిస్తున్నారు. దీంతో కాళ్లపై పడతారు గానీ సినిమాలను మాత్రం హిట్ చేయరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. అది కూడా నిజమే మరి.. విజయ్ దేవరకొండకు హిట్టు ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా రోజురోజుకూ మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కానీ ఆయన సినిమాలకు ఆ క్రేజ్ ఏమాత్రం పనికిరాకుండా పోతోంది. ఇంతటి ఫ్యాన్ బేస్ ఉన్నా ఇటీవల కాలంలో వరుస డిజాస్టర్స్ అందుకున్నారు విజయ్ దేవరకొండ. కాగా రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో రౌడీ హీరో ఆశలన్నీ ఇప్పుడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమా పైనే ఉన్నాయి. మరి ఈ సినిమాతో నైనా విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది చూడాలి. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 60 శాతం పూర్తయిందని తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×