BigTV English
Advertisement

Vijay Devarakonda – Rashmika: ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్.. తల్లితో కలిసి షాపింగ్ చేసిన విజయ్ అండ్ రష్మిక..!

Vijay Devarakonda – Rashmika: ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్.. తల్లితో కలిసి షాపింగ్ చేసిన విజయ్ అండ్ రష్మిక..!

Vijay Devarakonda – Rashmika: చిత్ర పరిశ్రమలో రూమర్స్ అనేవి సర్వ సాధారణం. ముఖ్యంగా సెలెబ్రిటీల ఎఫైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అయితే టాలీవుడ్‌లో అలాంటి రూమర్స్‌ను ఎదుర్కుంటున్న ప్రేమ జంటల్లో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్నా జంట కూడా ఉంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఈ రెండు పేర్లు ఒకేచోట కలిసి కనిపిస్తే వెంటనే ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతాయి. ఈ పేర్లకు అంతటి క్రేజ్ ఉంది మరి.


వీరిద్దరూ గత కొన్నేళ్ల నుంచి సీక్రెట్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నట్లు ఇప్పటికే చాలా వార్తలు జోరుగా వినిపించాయి. గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన వీరిద్దరూ తొలిసారి జోడీ కట్టారు. ఆ సినిమాలో వీరిద్దరి యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. దీంతో ప్రేక్షకుల ఫేవరెట్ జంటగా వీరిద్దరూ మారిపోయారు. ఈ సినిమా నుంచే విజయ్ – రష్మికపై రిలేషన్ రూమర్స్ మొదలయ్యాయి.

ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో వీరి జోడీ మరింత దృష్టిని ఆకర్షించింది. ఇందులో కూడా విజయ్ అండ్ రష్మిక జంట చాలా బ్యూటీఫుల్‌గా కనిపించడంతో ప్రేక్షకాభిమానులు ఫిక్స్ అయిపోయారు. దీంతో విజయ్, రష్మికకు సంబంధించిన ఎలాంటి వార్తనైనా పాపులర్ చేసేశారు. అలా స్టార్ట్ అయిన ఈ జంట లవ్ రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ రూమర్స్‌కు తగ్గట్టుగానే రష్మిక, విజయ్ కలిసి కనిపించడంతో వార్తలు మరింత ఊపందుకున్నాయి.


Also Read: విజయ్ తో పెళ్లి ఫిక్స్.. ఎట్టకేలకు బయటపెట్టిన రష్మిక..?

రష్మిక ప్రత్యేక రోజులలో విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లడం, అంతేకాకుండా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి వెకేషన్ కోసం మాల్దీవులకు, ఇతర ప్రదేశాలకు వెళ్లడం, అక్కడ వారు తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. అలాగే విదేశాల్లోనూ విజయ్ ఫ్యామిలీతో రష్మిక కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇలా ప్రతీది వారి రూమర్ రిలేషన్‌షిప్‌కి ఆజ్యం పోశాయి. దీంతో వీరిద్దరూ సీక్రెట్ డేటింగ్ చేస్తున్నట్లు చాలా మంది కన్ఫర్మ్ చేసుకున్నారు.

అయితే ఇప్పటి వరకు డీప్ లవ్‌లో మునిగితేలుతున్న ఈ ప్రేమ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు కూడా వార్తలు గత కొన్ని నెలల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగానే విజయ్, రష్మికల ఎంగేజ్‌మెంట్ ఫిబ్రవరి రెండో వారంలో జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి వారి ఎంగేజ్‌మెంట్ రింగ్‌ల కోసం షాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, అతడి తల్లి, రష్మిక కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో కొద్ది రోజుల నుంచి షాపింగ్ చేస్తున్నట్లు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×