Aishwarya Rai – Abhishek: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ జంట ఎంతో మందికి ఆదర్శం అనే చెప్పాలి. అలాంటి ఈ జంటపై గత కొన్ని నెలలుగా విడాకుల రూమర్స్ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఐశ్వర్య తన చిన్ననాటి స్నేహితుడితో చనువుగా ఉంటోందని, అందుకే అభిషేక్ దూరం పెట్టారని వార్తలు రాగా.. మరి కొంతమంది జయా బచ్చన్ (Jaya Bachchan) టార్చర్ భరించలేక ఐశ్వర్యరాయ్ తన అత్తవారింటికి అలాగే తన భర్తకు కూడా దూరం కాబోతోంది అంటూ వార్తలు సృష్టించారు అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదనే చెప్పాలి. ముఖ్యంగా కొడుకు, కోడలు విడాకుల వార్తలపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా స్పందించినా.ఈ విడాకుల వార్తలు మాత్రం ఆగలేదు.ఇక దీంతో ఎప్పటికప్పుడు ఈ జంట కలసి కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పెళ్లిలో జంటగా కనిపించి, రూమర్స్ కి చెక్ పెట్టిన ఐష్..
ఈ క్రమంలోనే తాజాగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ (Ashutosh Gowariker) కుమారుడి పెళ్లికి హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత జంటగా కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. క్రీం కలర్ మ్యాచింగ్ దుస్తుల్లో కనిపించి, ఈ జంట అందరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన సెలబ్రిటీ జంట విడాకులు తీసుకోవడం లేదు అని తెలిసి సంతోషంతో ఊగిపోతున్నారు. విడాకులు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఐశ్వర్యరాయ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోలను షేర్ చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చిందని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ విడాకుల వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.
Dilraju: పైరసీపై ఉద్యమం… నేను లీడ్ చేస్తా… ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు కామెంట్స్ వైరల్..!
ఐశ్వర్యరాయ్ కెరియర్..
మాజీ ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్.. దాదాపు 5 భాషల్లో నటించి తన అందంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ‘జీన్స్’ సినిమాలో నటించిన ఈమె..’రోబో’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత కొన్నాళ్లు అడపాదడపా సినిమాలు చేసిన ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యింది.. మళ్లీ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1&2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫిదా చేసింది. మళ్లీ 2023 తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు ఐశ్వర్యరాయ్. ఇక గతంలో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు అభిషేక్ తో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా జన్మించింది. ఇక ఇప్పుడు విడాకులు అంటూ వస్తున్న వార్తలకు ఏకంగా ఈ జంట చెక్ పెట్టింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా ఈ విడాకుల రూమర్లు ఇకపై పూర్తిగా ఆపేస్తారో లేదో చూడాలి.