సామాన్యులతో పోల్చుకుంటే సెలబ్రిటీలు న్యూ ఇయర్ వేడుకలను ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన వారితో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. అంతేకాదు ఈ క్రమంలోనే చాలా జంటలు బయటకు వస్తాయి కూడా.. ఇకపోతే ప్రస్తుత కాలంలో చాలామంది న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు పయనం అవుతున్నారు. అందులో భాగంగానే రూమర్ద్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ(Vijay deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఈసారి కూడా ఎయిర్పోర్టులో దొరికిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. న్యూ ఇయర్ వేడుకలు మరో ఆరు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ముందుగానే విదేశీయానం చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వీరిద్దరూ ఒకరి తరువాత ఒకరు ఎయిర్పోర్టులో కనిపించి రూమర్స్ ను నిజం చేశారు.
న్యూ ఇయర్‌కి ముందే జంప్..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ముంబై ఎయిర్పోర్టులో కనిపించి మీడియా కంట పడ్డారు. అంతేకాదు పలువురు అభిమానులు కూడా వీరితో విడివిడిగా ఫోటోలు దిగడం జరిగింది. తొలుత హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యక్షమైన వీరిద్దరూ.. ఆ తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ లో ఇద్దరూ ఒకేసారి కాకుండా ఒకరి తర్వాత మరొకరు కనిపించారు. దీనికి తోడు రష్మిక దగ్గర ఉన్న క్యాప్ ను విజయ్ ధరించి కనిపించడంతో ఇద్దరు కలిసే వచ్చారని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ముందే వెకేషన్ కి వెళ్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు వీరిద్దరూ రూమర్డ్ లవర్స్ గానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా ఈ జంటను చూసిన అభిమానులు మాత్రం కనీసం ఈసారైనా దొరకకుండా ప్లాన్ చేయాల్సింది అంటూ కామెంట్లు చేస్తున్నారు
అప్పుడప్పుడు హింట్ ఇస్తున్న జంట..
‘గీతాగోవిందం’ సినిమాతో అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మందన్న తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాదు ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వైరల్ గా మారగా.. దీనికి తోడు ఎప్పటికప్పుడు వీరిద్దరూ మీడియా కంట పడడంతో కూడా వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉండగా మరోవైపు పుష్ప2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేను ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నానో మీ అందరికీ బాగా తెలుసు అంటూ కూడా హింట్ ఇచ్చింది. మరొకవైపు విజయ్ దేవరకొండ కూడా నేను ఇంకా సింగిల్ గా ఉన్నానని మీరు అనుకుంటున్నారా అంటూ కామెంట్లు చేశారు. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఇదిలా ఉండగా రష్మిక మందన్న తాజాగా నటించిన చిత్రం పుష్ప 2. ఈ సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇందులో ఒక సన్నివేశం లో నటించడానికి ఇబ్బందికరంగా ఉండడంతో.. దానిని ఎలా చేయాలో విజయ్ దేవరకొండను అడిగి మరీ చేసిందట రష్మిక. ఏది ఏమైనా అప్పుడప్పుడు వీరు చెప్పే మాటలు సరికొత్త రూమర్స్ కి దారితీస్తున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోసారి దొరికిపోయిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న..!
తాజాగా ముంబై ఎయిర్పోర్టులో కనిపించిన విజయ్, రష్మిక
కానీ, ఎయిర్‌పోర్టుకు ఒకరి తర్వాత మరొకరు చేరుకోగా.. మరోసారి హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షం
రష్మిక దగ్గరున్న క్యాప్.. విజయ్ ధరించి కనిపించడంతో ఇద్దరూ కలిసే వచ్చారని సోషల్… pic.twitter.com/mbqdyH3vfO
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2024