JC Prabhakar Reddy: టీడీపీ ఫైర్‌బ్రాండ్, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. న్యూఇయర్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేశారు. ఇంతకీ దీని వెనుక కారణమేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
న్యూఇయర్, పండగ సందర్భంగా అభిమానులు వారి నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు. అందులోవారి ఫోటోను పెట్టుకోవడం సహజం. తరచూ ఇలాంటివి చూస్తున్నాము. దీనిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు పెట్టుకూడదన్నారు.
వాటికి ఖర్చు పెట్టే నిధులు పార్కు కోసం ఉపయోగించాలన్నారు. తాడిపత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన వెంటనే తొలగిస్తారమన్నారు. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే పట్టణ అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. విగ్రహాల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు ససేమిరా అన్నారు మున్సిఫల్ ఛైర్మన్.
గతంలో చెత్తపై కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేశారు. చివరకు పెనాల్టీ వరకు వచ్చింది. ఊరు బాగుంటే.. అందరం బాగుంటామనే కాన్సెప్ట్‌ని ఆ ప్రాంత ప్రజలు స్వాగతించిన విషయం తెల్సిందే.
నూతన సంవత్సర వేడుకలకు ఫ్లెక్సీలు పెడితే తొలగిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి
మీకు డబ్బులు ఎక్కువ ఉంటే పట్టణ అభివృద్ధి కోసం ఇవ్వండి
విగ్రహాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదు
తాడిపత్రి పట్టణంలో ఎక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా వెంటనే తొలగిస్తాం
– జేసీ ప్రభాకర్ రెడ్డి pic.twitter.com/ePKopJISNT
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2024