IND-W U19 Squad: రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహిళల అండర్ – 19 ప్రపంచకప్ టి-20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్ ను ప్రకటించింది క్రికెట్ బోర్డ్. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మలేషియాలో జరిగే ఈ టోర్నీ షెడ్యూల్ ని ఐసీసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ బరిలోకి దిగబోతోంది.
Also Read: MS Dhoni: ధోని క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!
గ్రూప్ ఎ లో వెస్టిండీస్, భారత్, మలేషియా, శ్రీలంక జట్లు తలపడతాయి. గ్రూప్ బి లో పాకిస్తాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, ఇంగ్లాండ్. గ్రూప్ సి లో సమోవా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, క్వాలిఫైయర్ (ఆఫ్రికా రిజియన్) నుంచి ఉండగా.. గ్రూప్ డి లో స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, క్వాలిఫైయర్ (ఆసియా రీజియన్) నుంచి చోటు దక్కించుకున్నాయి. ఈ టోర్నీలో జనవరి 19న వెస్టిండీస్ తో జరగబోయే మ్యాచ్ తో భారత జట్టు వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టబోతోంది.
గ్రూప్ దశలో ఒక్కో జట్టు ప్రత్యర్థి తో ఒక్కో మ్యాచ్ ఆడనుండగా.. టాప్ 3 లో నిలిచిన చెట్లు సూపర్ సిక్స్ కి అర్హత సాధిస్థాయి. జనవరి 31న సెమీ ఫైనల్స్, ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనబోయే జట్టును సోమవారం రోజు అమెరికా ప్రకటించగా.. మంగళవారం రోజు భారత్ తమ జట్టును ప్రకటించింది.
ఈ టీమ్ లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష కు చోటు దక్కడం విశేషం. ఈ సిరీస్ లో టీమ్ ఇండియా సెమిస్ చేరితే రెండో సెమీఫైనల్స్ ఆడే అవకాశం ఉంది. సెమీస్, ఫైనల్స్ కి రిజర్వ్ డే లు ఉన్నాయి. ఇక తాజాగా జరిగిన అండర్ – 19 మహిళల ఆసియా కప్ ప్రారంభ ఎడిషన్ ను భారత మహిళా జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.
Also Read: sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ
బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఫైనల్ లో టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 20 ఓవర్లలో 117 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య చేదనకు దిగిన బంగ్లాదేశ్ 76 పరుగులకే కుప్పకూలింది. ఈ మహిళ అండర్ 19 ప్రపంచకప్ లో ఈసారి సత్తా చాటేందుకు భారత జట్టు ఉవ్విల్లూరుతోంది.
భారత జట్టు : నిక్కి ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే (వైస్ కెప్టెన్), జి త్రిష, కమలిని జి (వికె), భావికా అహిరే (వికె), ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషిత విజె, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, కేసరి దృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, ఎండి షబ్నమ్, వైష్ణవి ఎస్. స్టాండ్‌బై ప్లేయర్ లు: నంధన ఎస్, ఇరా జె, అనాది టి.