Viduthalai Part2.. ఒకప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో అడపా దడపా సినిమాలు చేస్తూ తనకంటూ పేరు దక్కించుకున్నారు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి, తనలోని మరో యాంగిల్ ను చూపించారు. ముఖ్యంగా ఈయన నటించిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా విజయ్ సేతుపతికి మంచి ఇమేజ్ లభించింది. ఇకపోతే ఇప్పటికే కోలీవుడ్ నుంచి చాలామంది టాలీవుడ్ లో అడుగుపెట్టి ఇక్కడ మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలాంటి వారందరికీ సరైన సక్సెస్ లభించలేదు. కానీ విజయ్ సేతుపతి మాత్రం అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకోవడంతో ఈయనకు తెలుగులో కూడా భారీ మార్కెట్ ఏర్పడింది.
ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కి వచ్చిన టీమ్
ఇదిలా ఉండగా తాజాగా ఈయన నటిస్తున్న పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ విడుతలై పార్ట్ -2. వెట్రిమారన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను ఏడాది డిసెంబర్ 20వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి మంజు అలాగే విజయ్ సేతుపతి వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఈ సినిమాలో కేవలం ఎనిమిది రోజుల నిడివి కోసం మాత్రమే తనను తీసుకున్నారని, కానీ 120 రోజులపాటు షూటింగ్ చేశారని తెలిపారు విజయ్ సేతుపతి. అలాగే మంజు కూడా తనది క్యామియో రోల్ అని చెప్పిన ఈమె.. ఆ తర్వాత తన పాత్ర ఈ సినిమాకి అత్యంత కీలకమని కూడా చెప్పుకొచ్చింది. ఇక దీంతో ఈ సినిమాపై ఇటు తెలుగు ఆడియన్స్ లో కూడా ఆసక్తి కలిగింది అని చెప్పవచ్చు.
గిరిజనులకు – పోలీసులకు మధ్య సాగే కథ..
ఇకపోతే ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, మంజు, సూరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్, గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ, రెడ్ జాయింట్ మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సౌండ్ ట్రాక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే కమెడియన్ సూరి ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాతో సూపర్ బ్రేక్ అందుకోబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా మంజు వారియర్ నటిస్తోంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది.
సెన్సార్ పూర్తి.. రన్ టైం లాక్..
ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో అటు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి రన్ టైం కూడా లాక్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాదు 2:55 గంటల నిడివిని కూడా లాక్ చేశారు. అంటే దాదాపు మూడు గంటల సినిమా.. మరి థియేటర్లలో ఆడియన్స్ ను అప్పటివరకు కూర్చోబెడుతుందో లేదో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ అయితే వచ్చింది కానీ సినిమాకి తగ్గట్టు సెన్సార్ రిపోర్టు లేదని సమాచారం
ఇక భారీ అంచనాల మధ్య డిసెంబర్ 20 న క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.