Uttam Kumar Reddy on New Ration Cards: దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులను ఇవ్వబోతోంది కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబందించి ఆ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం పక్కదానిపై పట్టడంపైనా ఆశక్తికరమైన కామెంట్స్ చేశారాయన.
సోమవారం శాసనమండలిలో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం ఉంటుందన్నారు. కులగణన సర్వే ఆధారంగా లబ్దిదారుల ఎంపిక చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం ఇస్తామన్నారు.
ఇప్పటికే కులగణనపై డేటా సేకరించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. కొత్త రేషన్ కార్డులపై దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వం వద్దనున్న డేటా బేస్‌తో కంపేర్ చేసి కొత్త కార్డులు ఇస్తామన్నారు. రేషన్ డీలర్ల ఖాళీలుంటే వెంటనే ఫుల్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చామన్నారు. భర్తీ కాకుండా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సభ్యులకు తెలిపారు.
రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం పోతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. అనర్హులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నారన్నారు.
ALSO READ: అసెంబ్లీలో పంచాయితీ నిధుల లొల్లి.. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్, చేతులెత్తేసిన హరీష్‌రావు
దీనిపైనా మంత్రి ఉత్తమ్ స్పందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వాస్తవమన్నారు. ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈలెక్కన కొత్త కార్డుల వారికి మంత్రి శుభవార్త చెప్పారు.
రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయి: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం పోతోందని అనుమానం వ్యక్తం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి
రేషన్ బియ్యం అక్రమ రవాణా వాస్తవమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదని.. సన్న… pic.twitter.com/OUFOiZ3rRD
— BIG TV Breaking News (@bigtvtelugu) December 16, 2024
సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు
శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన
కులగణన సర్వే ఆధారంగా లబ్దిదారుల ఎంపిక
ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కలెక్టర్లకు ఆదేశం@UttamINC#Telangana #Assembly #WinterSession #BigTV pic.twitter.com/Nu0WeN6FdO
— BIG TV Breaking News (@bigtvtelugu) December 16, 2024