Vijay Thalapathi:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi) తన చివరి సినిమాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జన నాయగన్’. తమిళ్ భాష రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ (H.Vinod) దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటిస్తోంది.. ఇక బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ వాసుదేవ్, నరైన్, ప్రియమణి, మమిత బైజు, మోనిషా బ్లెస్సీ తోపాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయరంగం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 9 2026 పొంగల్ సందర్భంగా విడుదల కాబోతోంది.
ఆయనపై గన్ గురిపెట్టిన విజయ్..
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసి కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరి కొంతమంది నవ్వుకుంటున్నారు. ఇకపోతే సాధారణంగా షూటింగ్ సెట్లో కాస్త షూటింగ్ నుండి విరామం దొరికితే చాలు సెలబ్రిటీలు సరదాగా గడుపుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే జన నాయగన్ షూటింగ్ సెట్లో విజయ్ దళపతి ఏకంగా ఒక వ్యక్తిపై గన్ ఎక్కుపెట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో విషయానికి వస్తే.. అటువైపు దూరంగా వీటీవీ గణేష్ సరదాగా తోటి సెలబ్రిటీస్ తో మాట్లాడుతూ ఉండగా.. ఇటునుంచి విజయ్ దళపతి గన్ను గురిపెట్టి వీటివీ గణేష్ పొట్టపై నేరుగా గన్ పేల్చుతాడు. సడన్గా టాయ్ తన పొట్టకు తగిలేసరికి అలర్ట్ అవుతాడు వీటీవీ గణేష్ . ఇక సెట్ లో ఉన్న పూజా హెగ్డే తో సహా అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విజయ్ దళపతి కెరియర్..
ఇక విజయ్ దళపతి విషయానికి వస్తే.. సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. అలా వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక అవమానాలు, హేళనలు అన్నింటినీ ఎదుర్కొని నేడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుడిగా చలామణి అవుతున్నారు. ఒకానొక సమయంలో రూ.150 కోట్లకు పైగా పారితోషకం తీసుకొని రికార్డు సృష్టించారు విజయ్ దళపతి. ఇక ఇప్పుడు రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఇప్పుడు జననాయగన్ సినిమాను పూర్తి చేసి, ఇక పూర్తిగా తన జీవితాన్ని రాజకీయ రంగానికే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీని స్థాపించి, 2026 ఎన్నికలలో పోటీ చేయాలని కూడా చూస్తున్న విజయ్ దళపతికి రాజకీయరంగం ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి. ఇప్పటికే సినిమాల ద్వారా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయనను రాజకీయంగా ఆదరిస్తారో లేదో చూడాలి.