BigTV English
Advertisement

Mazaka Day 1 Collections: సందీప్ కిషన్ ‘ మజాకా ‘ షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Mazaka Day 1 Collections: సందీప్ కిషన్ ‘ మజాకా ‘ షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Mazaka Day 1 Collections: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాల గురించి అందరికీ తెలుసు. ఇప్పటివరకు పలు సినిమాల్లో హీరోగా నటించిన ఆయనకు కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే మంచి హిట్ ని అందించాయి. సరైన హిట్ టాక్ ట్రాక్ ను మెయింటైన్ చెయ్యకపోవడంతో ఆడియన్స్ పెద్దగా సందీప్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు. అయితే ఈసారి కథలు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకున్న హీరో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ నే మజాకా.. ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..


సందీప్ కిషన్ మొదటి నుంచి వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు మజాకాతో ప్రేక్షకుల మనసు దోచుకుంటాను అని మజాకా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించగా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందిన మజాకా చిత్రానికి ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్‌గా లియోన్ జేమ్స్, సినిమాటోగ్రాఫర్‌గా నిజార్ షఫీ తదితరులు సాంకేతిక నిపుణులుగా పనిచేశారు. సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, అన్షు హీరో, హీరోయిన్లు నటించగా మురళీ శర్మ, శ్రీనివాసరెడ్డి తదితర ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటించారు.. దాదాపు 20 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. మొదటిరోజు పర్వాలేదనిపించింది ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

Also Read :హీరోపై కోపంతో చుక్కలు చూపించిన తమన్.. ఏం జరిగిందంటే..?


మజాకా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆంధ్రా, నైజాం హక్కులు 9 కోట్ల రూపాయల మేర, ఓవర్సీస్ రైట్స్ 1 కోటి రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 50 లక్షల మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌గా వాల్యూ కట్టారు.. 10 కోట్లకు పైగా బిజినెస్ జరగ్గా, 12 కోట్లకు పైగా టార్గెట్ తో 750 స్క్రీన్ లలో మూవీని రిలీజ్ చేశారు.. రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించాయి.. శివరాత్రి కావడం తో చాలావరకి కలెక్షన్స్ బాగానే వచ్చాయి ఈ సినిమా తప్ప మిగతా సినిమాలు కొత్తగా ఏవి లేకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. మొదటి రోజు దాదాపు మూడు కోట్ల వరకు వసూలు చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఇంకా తొమ్మిది కోట్లు రాబట్టాల్సి ఉంది. మొత్తానికి మొదటి రోజైతే ముచ్చటగా మూడు కోట్లతో ఓపెనింగ్ చేశారు.. ఇవాళ కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయని తెలుస్తుంది ఇక వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు. మరి ఎన్ని కోట్లను రాబడుతుందో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×