Producer Kedar: అల్లు అర్జున్ (Allu Arjun) ప్రాణ స్నేహితుడు, ‘గంగం గణేశా’ సినిమా నిర్మాత కేదార్ (Kedar) అతి చిన్న వయసులోనే మరణించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. నిర్మాత కేదార్ మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతోంది. ఇంత చిన్న వయసులోనే ఆయన మరణించడానికి గల కారణం ఏంటి అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేదార్ మృతి పై సస్పెన్స్ కొనసాగుతోంది ఆయన ఎందుకు మృతి చెందారు అన్న విషయం మిస్టరీగా మారింది. దుబాయ్ లో కేదార్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసే సూచనలు కనిపిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా మరణాల విషయంలో దుబాయ్ పోలీసులు 24 గంటల్లోనే డెడ్ బాడీలను సంబంధిత వ్యక్తులకు అందజేస్తారు. కానీ కేదార్ మృతి పై అలాంటి విధానం ఏదీ కూడా కనిపించకపోవడంతో పలువురిలో పలు సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
కేదార్ మృతిపై అనుమానాలు..
ముఖ్యంగా కేదార్ చనిపోయిన సమయంలో ఆయన దగ్గర ఎవరున్నారు? అనే అంశం కూడా నిర్ధారణ కాలేదు. అటు దుబాయ్ నుంచి ఇండియాకు కేదార్ మృతదేహం ఎప్పుడు వస్తుంద అన్న విషయం పై క్లారిటీ కూడా లేదు. కేదార్ మృతి చెంది ఇప్పటికే నాలుగు రోజులు అవుతున్నా.. దుబాయ్ పోలీసులు మాత్రం దీనికి గల కారణాలను బయట పెట్టలేకపోతున్నారు. ఇక దుబాయ్ లో ఒక వేడుకకు హాజరైన సమయంలో తన ఫ్లాట్ లో ఆయన మృతి చెందినట్లు సమాచారం.ఇకపోతే రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు విచారణ తుదిదశకు చేరుకున్న సమయంలోనే సడన్గా కేదార్ మృతి చెందడంతో పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. దుబాయ్లో కేదార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. అయితే మరొకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులు కోరితే విచారణ జరిపిస్తామని ఇప్పటికే ప్రకటించారు.
ప్రముఖులతో లావాదేవీలు.. సందిగ్ధంలో పడ్డ ప్రముఖులు..
దీనికి తోడు అటు చాలామంది ప్రముఖులతో కేదార్ కు మంచి లావాదేవీలు కూడా ఉన్నాయి. సినీ పరిశ్రమకు చెందిన కొంతమందితో దుబాయ్లో కేదార్ పెట్టబడులు పెట్టించినట్లు కూడా తెలుస్తోంది .. అయితే కేదార్ తో ఆర్థిక లావాదేవీలు ఉన్న వారంతా కూడా ఇప్పుడు ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడిపోయారు. ఇకపోతే ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇండియాకి తెప్పించుకోవాలా? లేక దుబాయ్ లోనే ఉంచాలా? ఒకవేళ అక్కడే ఉంచితే వాటి భద్రత సంగతి ఏంటి..? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం తోనే చాలామంది ప్రముఖులు కేదార్ తో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు సమాచారం. ఆ లేవాదేవిలే ఇప్పుడు తమను కొంప ముంచేలా ఉన్నాయని మరి కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేదార్ కు సంబంధించిన ఫోన్ తో పాటు ఇతర డాక్యుమెంట్లు ఆయన కుటుంబ సభ్యులకు భద్రంగా చేరితే తప్ప ఈ సమస్యలకు చెక్ పడే పరిస్థితి కనిపించడం లేదు. ఇకపోతే చాలామంది ప్రముఖులు ఇప్పుడు కంటిమీద కునుకు తీసే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా కేదార్ మృతి అటు పలు అనుమానాలకు దారి తీయడమే కాకుండా చాలామందికి ఆటంకంగా మారిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Kajal – Tamannaah: సీనియర్ బ్యూటీలకి షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..!