BigTV English

Actor Prudhvi Raj: నటుడు పృథ్వీరాజ్‌కి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ!

Actor Prudhvi Raj: నటుడు పృథ్వీరాజ్‌కి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ!

Actor Prudhvi Raj: ప్రముఖ సినీ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు పృథ్వీ. పలు సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన నటుడు పృథ్వీకి తాజాగా షాక్ తగిలింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నటుడు పృథ్వీ రాజ్ భార్య శ్రీ లక్ష్మి తనకు మనోవర్తి చెల్లించాలని గతంలో కోర్టును ఆశ్రయించింది. దీంతో నటుడు పృథ్వీ తన భార్యకు మనోవర్తి చెల్లించాలని కోర్టు తెలిపింది. కానీ కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో పాటు నటుడు పృథ్వీరాజ్ కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అసలేమైంది అనే విషయానికొస్తే..


నటుడు పృథ్వీరాజ్‌ 1984లో శ్రీలక్ష్మిని మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే కొంతకాలం బాగానే ఉన్నారు. కానీ ఒకానొక సమయంలో అనివార్య కారణాల వల్ల ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక అప్పటి నుంచి వీరిద్దరు విడిగానే ఉంటున్నారు. దీంతో శ్రీలక్ష్మి తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం 2017లో కోర్టును ఆశ్రయించింది. అదే క్రమంలో తన భర్త పృథ్వీ రాజ్ నుంచి తనకు నెలకు రూ.8లక్షలు భరణం ఇప్పించాలని కోర్టును కోరింది.

Also Read: భార్యను వదిలేసి హీరోయిన్‌తో దర్శన్ సహజీవనం.. ప్రశ్నించిన అభిమాని హత్య!


ఎందుకంటే పృథ్వీరాజ్ సినిమాలు చేస్తున్న సమయంలో అతడికి అయ్యే ఖర్చులన్నీ తన కుటుంబమే చూసుకుందని తెలిపింది. కానీ అతడు సినిమాల్లోకి వెళ్లాక తనను వేధిస్తూ ఉండేవాడని పేర్కొంది. అదే సమయంలో 2016లో తనను బయటకు పంపించడంతో పుట్టింటికి వచ్చేసినట్లు అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఇక ఆ సమయంలోనే తన భర్త సినిమాలు, సీరియల్స్ చేస్తూ నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తుండటంతో తనకు భరణం ఇప్పించాలని కేసు దాఖలు చేసింది. దీనిపై కోర్టు 2022 లో తీర్పు వెలువరించింది.

అప్పటి వరకు శ్రీలక్ష్మికి అయిన కోర్టు ఖర్చులతో పాటు నెలకు రూ.8లక్షలు పదోతేదీ లోపల చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే నటుడు పృథ్వీరాజ్ కోర్టు ఆదేశాలను పాటించకపోవడమే కాక.. కోర్టుకు కూడా హాజరుకాకపోవడంతో అతడి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. చూడాలి మరి చివరికి ఏమౌవుతుందో..

Tags

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×