BigTV English

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Viran Muttemshetty: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో విరాన్ ముత్తంశెట్టి. బన్నీ కజిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినా.. నటుడిగా నిలబడడానికి విరాన్ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే విరాన్ బతుకు బస్టాండ్, ముఖ్య గమనిక, పురుషోత్తముడు లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం విరాన్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.


విరాన్ హీరోగా నటిస్తున్న చిత్రం గిల్ట్. చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్ మీద లక్ష్మీ సునీల, డా. పార్థసారథి రెడ్డి, ఎ. శివ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.

టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా డిజైన్ చేసారు.  క్రైమ్ సీన్ లో రెండు సీతాకోక చిలుకలను చూపించారు. గిల్ట్ కి ట్యాగ్ లైన్ గా ట్రూ లవర్ అని పెట్టడంతో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో పాటుగా క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.


ఇప్పటివరకు విలన్ గా నటించి మెప్పించిన విరాన్.. ఇప్పుడు హీరోగా గిల్ట్ అనే సినిమాతో వస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విరాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

 

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×