BigTV English

Siraj :- సిరాజ్ అకౌంట్లో తిరుగులేని రికార్డ్స్

Siraj :- సిరాజ్ అకౌంట్లో తిరుగులేని రికార్డ్స్

Siraj :- హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్‌కు చుక్కలు చూపిస్తూ.. బెంగళూరు జట్టుకు బ్యాక్ బోన్‌గా నిలుస్తున్నాడు. ఓవైపు వికెట్లు అకౌంట్లో వేసుకుంటూనే.. మరోవైపు రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ ఐపీఎల్ ఈ సీజన్ లో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా నంబర్ 1 స్థానంలో నిలిచాడు మహ్మద్ సిరాజ్. ఈ సీజన్ లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 24 ఓవర్లు బౌలింగ్ వేసి.. అందులో అత్యధికంగా 81 డాట్ బాల్స్ ఇచ్చాడు.  


ముఖ్యంగా పవర్ ప్లేలోనూ చాలా పొదుపైన బౌలింగ్ వేస్తున్నాడు సిరాజ్. పవర్ ప్లేలో 72 బంతులేసిన సిరాజ్.. 51 బంతులకు పరుగులే ఇవ్వలేదు. ఇది సరికొత్త రికార్డ్. పైగా 7 ఎకానమీతో 12 వికెట్లు తీసుకున్నాడు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు పేస్‌ను జోడిస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ ఓనర్ మహ్మద్ సిరాజే. పంజాబ్‌తో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డ్ కూడా దక్కింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.

ఇక డాట్ బాల్స్ వేయడంలో సిరాజ్ తర్వాత షమీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. షమీ మొత్తం 65 డాట్ బాల్స్ వేశాడు. జోసెఫ్ 48, మార్క్ ఉడ్ 48, అర్షదీప్ 45, భువనేశ్వర్ 45, రషీద్ ఖాన్ 45 డాట్ బాల్స్ వేశారు.


Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×