Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ (Prabhas)బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ప్రభాస్ “ది రాజా సాబ్” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతోపాటు మరిన్ని పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో ప్రభాస్ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
రుద్ర పాత్రలో ప్రభాస్..
ప్రభాస్ ఇలా పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా మరోవైపు పలు సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప(Kannappa) సినిమాలో కూడా ప్రభాస్ బాగమయ్యారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర(Rudra) అనే పాత్రలో కనిపించబోతున్నారని చిత్ర బృందం వెల్లడించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ చివరిలో ప్రభాస్ చూసే ఒక్క చూపు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తుంది. తాజాగా మంచు విష్ణు ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు..
మైలు రాయిగా నిలిచిపోతుంది..
ఈ సినిమాలో ప్రభాస్ నటించడం చాలా గొప్ప విషయమని విష్ణు తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైం సుమారు 30 నిమిషాల పాటు ఉంటుందని, ప్రభాస్ నటించిన రుద్ర పాత్ర తన సినీ కెరియర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని విష్ణు తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ నాతో మాట్లాడుతూ… ఒరేయ్ విష్ణు, బావ ఇక్కడే ఉన్నాడు ఆయన ముందు నాకు పెద్ద పెద్ద డైలాగులు ఇవ్వద్దు అంటూ చెప్పారు. ఇక ప్రభాస్ మోహన్ బాబుని బావ అంటూ పిలుస్తారనే విషయం తెలిసిందే. పెద్దపెద్ద డైలాగులు ఇవ్వద్దు అంటూ ప్రభాస్ చెప్పినప్పటికీ నేను మాత్రం తనని ఇబ్బంది పెట్టానని విష్ణు తెలిపారు.
" #Prabhas screen time is around 30 minutes in Kannappa.
RUDHRA character will be a milestone in his film career, that's what I feel. I troubled him with long dialogues, but he still did it."
– #VishnuManchu | #Kannappa pic.twitter.com/8MllGJr2FS
— Movies4u Official (@Movies4u_Officl) June 4, 2025
ప్రభాస్ పాత్ర కోసం రాసిన పెద్ద డైలాగులలో చిన్న చిన్న మార్పులు చేసి ప్రభాస్ చేత డైలాగులు చెప్పించామని విష్ణు తెలిపారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. రెమ్యూనరేషన్ గురించి ప్రభాస్ తో నేను మాట్లాడలేక నాన్నతో మాట్లాడమని చెప్పాను కానీ, నాన్న ఈ టాపిక్ గురించి మాట్లాడుతాడని గ్రహించిన ప్రభాస్ విష్ణు గాన్ని చంపేస్తానని చెప్పు బావ అంటూ మాట్లాడారు. ఇలా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రభాస్ విష్ణు కోసం కన్నప్ప సినిమాలో నటించారని స్పష్టమవుతుంది. ఇక ప్రభాస్ ఫోన్ నెంబర్ ని మీ మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారనే ప్రశ్న కూడా ఎదురు కావడంతో రెబల్ అని సేవ్ చేసుకున్నట్టు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విష్ణు తెలిపారు.