Assembly Rowdy: మంచు విష్ణు(Manchu Vishnu) ప్రస్తుతం కన్నప్ప సినిమా(Kannappa Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలలో భాగంగా మంచు విష్ణు కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఇక తన తండ్రి సినిమాల గురించి మంచు విష్ణు మాట్లాడారు. ఇక పోతే తాజాగా విష్ణు తన తండ్రి నటించిన అసెంబ్లీ రౌడీ(Assembly Rowdy) సినిమా గురించి తన మనసులో కోరికను బయటపెట్టారు.
అసెంబ్లీ రౌడీ చేయాలని ఉంది…
తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu) నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాని రీమేక్ చేయాలని ఉందని, తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు. మోహన్ బాబు, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం 1991 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లరిగా తిరిగే మోహన్ బాబు రౌడీలను చంపి జైలుకు వెళ్లడం,జైలు నుంచే ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇలాంటి ఒక అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
శ్రీకాంత్ ఓదెల..
ఇకపోతే ఈ సినిమా గురించి మంచు విష్ణు మాట్లాడుతూ… అసెంబ్లీ రౌడీ సినిమా చేయాలని నాకు విపరీతమైన ఆసక్తి ఉంది కానీ, ఆ సినిమాని చేసే అంత సత్తా ఉన్న దర్శకులు దొరకలేదని మంచు విష్ణు తెలిపారు. ఒకవేళ ఈ సినిమా చేసే ఛాన్స్ వస్తే చేస్తారా? అంటూ ప్రశ్న వేయగా 100% తాను ఈ సినిమా చేస్తానని తెలిపారు. ఒకవేళ చేస్తే ప్రెసెంట్ ఉన్న డైరెక్టర్లలో ఎవరితో చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంచు విష్ణు సమాధానం చెబుతూ… ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లలో శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో తాను అసెంబ్లీ రౌడీ సినిమా చేస్తాను అంటూ ఈ సందర్భంగా విష్ణు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#అసెంబ్లీరౌడీ నాకు విపరీతమైన ఆసక్తి ఉంది… ఆ సినిమా చేయగలిగితే #SrikanthOdela తో చేయాలని ఉంది – #VishnuManchu https://t.co/F0sJC2Q9QK pic.twitter.com/4cYgj7wNKS
— Rajesh Manne (@rajeshmanne1) June 4, 2025
మరి మంచు విష్ణు కోరుకున్న విధంగా అసెంబ్లీ రౌడీ చేసే ఛాన్స్ వస్తుందా? అందుకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా ఓకే చెబుతారా అనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్లలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చేయటం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ,10 సంవత్సరాలుగా ఈ సినిమా కోసం తాను కష్టపడుతున్నానని విష్ణు తెలిపారు. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ బాబు, ప్రభాస్, కాజల్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా ద్వారా మంచు మూడో తరం వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.