BigTV English

Viswak Sen : అప్పుడు వీపులు పగులాయి… ఇప్పుడు మందు బాటిల్స్ ఉన్నాయి..

Viswak Sen : అప్పుడు వీపులు పగులాయి… ఇప్పుడు మందు బాటిల్స్ ఉన్నాయి..

Viswak Sen : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న కూడా మరోవైపు వివాదాలను కోరి తెచ్చుకుంటాడు. ఈయన స్టేజ్ ఎక్కితే వివాదం రెడీ ఉంటుందేమో అని ఆయన ఫ్యాన్స్ ఆలోచనలో పడతారు. అంతగా ఆయన స్పీచ్ లు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో రివ్యూవర్ పై దారుణంగా తిట్టి మళ్లీ సారీ చెప్పాడు. నిన్న తాజాగా ఓ ఈవెంట్ లో వీపులు పగులుతాయి అని అన్నాడు. ఆ మాటలను కవర్ చేసుకోవడానికి రివ్యూవర్లతో పార్టీ చేసుకున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. అది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం..


“మెకానిక్ రాకీ” ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. 

ఆదివారం వరంగల్ లో మెకానిక్ రాకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో విశ్వక్ సేన్ రెచ్చిపోయారు. రివ్యూయర్స్, ట్రోలర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఆ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ రెచ్చిపోయాడు. ఎప్పటిలా చెలరేగిపోయాడు విశ్వక్‌సేన్. ముందుగా ట్రోలర్స్ పై పడ్డాడు. తానేదో సినిమా ప్రమోషన్లలో కాస్త జోష్ మీద మాట్లాడితే, అదే ముక్కను అటు తిప్పి ఇటు తిప్పి వేస్తారు. ‘మీరు నన్నేం పీకలేరం’టూ… కాస్త బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు. రివ్యూవర్లకు ‘వీపులు పగులుతాయ్‌’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు సినిమా గురించి ఏమి రాసుకున్నా పర్వాలేదు. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే తాట తీస్తాను అని హెచ్చరించాడు. ఆ తర్వాత కాస్త కూల్ అయ్యాక రివ్యూవర్ల పై తనకు గౌరవం ఉందని, చిన్నచూపు లేదని, వాళ్లకు నచ్చేలా సినిమాలు తీస్తానని, కానీ రాసేటప్పుడు రివ్యూవర్లు కూడా బాధ్యతగా ఉండాలంటూ గుర్తు చేసాడు . ఇక మీదట ఎప్పుడూ రివ్యూవర్ల గురించి మాట్లాడడని ఈ వేదికపై నుంచి మాట ఇచ్చేశాడు.. అయితే ముందు అనాల్సినవి అనేసి ఇప్పుడు బుజ్జగించితే సరిపోతుందా అని ఆయనపై రివ్యూవర్లు మండి పడ్డారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది..


రివ్యూవర్లతో రూప్ ఆఫ్ లో పార్టీ.. 

నిన్న ఈవెంట్ లో విశ్వక్ మాట్లాడిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో మనం చూసాం.. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద యుద్ధమే జరిగింది. ఎప్పుడు తన సినిమా రిలీజ్ అయితే రివ్యూవర్లను టార్గెట్ చేస్తూ మాట్లాడటం బాగోలేదని, మా మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని అనుకున్నారు. ఆ కాస్త విశ్వక్ సేన్ చెవిలో పడటంతో వాళ్ళను కూల్ చేసేందుకు రూప్ ఆఫ్లో  టాప్ రివ్యూవర్లతో కలిసి మందు పార్టీని అరేంజ్ చేసారని చేసారని తెలుస్తుంది. ఈ పార్టీ గురించి తెలుసుకున్న నెటిజన్లు అప్పుడు అనడం ఎందుకు, ఇప్పుడు బుజ్జ గించడం ఎందుకు అని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వార్త మాత్రం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది.. ఇక మెకానిక్ రాకీ మూవీ ఈ నెల 22 న విడుదల కాబోతుంది. ఈ వివాదాల నడుమ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×