OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఎంటర్టైన్ చేస్తే మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. మిడిల్ క్లాస్ జీవితాలకు సంబంధించిన ఒక మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ పేరు “నమ్తే నమ్తే” (Namte namte). ఇది ఒక బెంగాల్ మూవీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ను ఆసరాగా చేసుకుని, ఆ ఫ్యామిలీని ఒక రౌడీ ఇబ్బంది పెడతాడు. ఈ మూవీ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
సుబ్బారావు, సీమ భార్య భర్తలు గా ఉంటూ తమ కుటుంబాన్ని పోషిస్తుంటారు. భర్త భయస్తుడు కావడంతో భార్య తనకు సపోర్టుగా ఉంటూ వస్తుంది. వీళ్లు అద్దె ఇంట్లో ఉంటూ వారి కార్యక్రమాలను సాగిస్తూ ఉంటారు. సుబ్బారావు కు కూతురు ఉండటంతో ఇంటి లోనే ట్యూషన్ మాస్టర్ తో చదువు చెప్పిస్తూ ఉంటాడు. ఒకరోజు వీరుంటున్న వీధిలో కొత్తగా వచ్చిన ఒక రౌడీ వసూళ్లకు పాల్పడుతూ అందరిని బెదిరిస్తూ ఉంటాడు. వాడు ఎంత చెడ్డవాడో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అయితే సుబ్బారావు మాత్రం అతనితో క్లోజ్ గా ఉంటూ, తనకున్న చిన్న చిన్న సమస్యలను తీర్చుకుంటూ ఉంటాడు. ఆ రౌడీ ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో సుబ్బారావు గ్రహించలేక పోతాడు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుబ్బారావు కూతురు ట్యూషన్ మాస్టర్ తో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి కూతురికి వార్నింగ్ ఇస్తుంది. ట్యూషన్ మాస్టర్ మాత్రం సుబ్బారావు తో మీకూతుర్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు.
సుబ్బారావు ఆ రౌడీ దగ్గరికి వెళ్లి ఈ సమస్య చెప్తాడు. అయితే ఆ రౌడీ నీ కూతుర్ని నా దగ్గరికి పంపించు, నేను మాట్లాడి సెట్ చేస్తానని వ్యంగంగా సమాధానం చెప్తాడు. అప్పుడు సుబ్బారావు వాడి దుర్బుద్ధిని పసిగడతాడు. ఇంటికి వెళ్లిన సుబ్బారావు ఆ వీధి రౌడీ కి భయపడి కూతుర్ని తన ఊరికి పంపిస్తాడు. ఆ రౌడీ ఆదేరోజు మద్యం తాగి సుబ్బారావు ఇంటికి వచ్చి, నీ కూతురు ఎక్కడ అని బెదిరిస్తాడు. సుబ్బారావును చంపేస్తాడేమోనని భార్య ఒక నిర్ణయానికి వస్తుంది. కూతురు బదులు నేను నీతో వస్తానని ఆ రౌడీ కి చెప్తుంది. ఆమె తీసుకున్న నిర్ణయానికి భర్త షాక్ అవుతాడు. ఇంతకీ ఆ రౌడీ నుంచి వీళ్లు తప్పించుకోగలిగారా? సుబ్బారావు తన తప్పుని తెలుసుకున్నాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.