Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అయితే హిట్స్ మాత్రం చెప్పుకోదగ్గ విధంగా లేవు. తాజాగా ఈ హీరో ‘లైలా’ (Laila) అనే మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘లైలా’ మూవీ ప్రమోషన్లలో భాగంగా తను ఆ ఒక్క జానర్ సినిమాలు మాత్రం చేయనని తేల్చి చెప్పారు. మరి ఈ హీరో ఏ జానర్ లో సినిమాను చేయనని చెప్తున్నాడు ? ఎందుకు విశ్వక్ సేన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? అనే వివరాల్లోకి వెళితే…
ఆ జానర్ మాత్రం టచ్ చేయనంటున్న విశ్వక్ సేన్
విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా, రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘లైలా’ (Laila). ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాతగా ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. ‘లైలా’ మూవీని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసిన విశ్వక్ సేన్ ఆ ఒక్క జానర్ ను మాత్రం టచ్ చేయను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘లైలా’ (Laila) మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా విశ్వక్ సేన్ (Vishwak Sen) మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో భాగంగా “హర్రర్ జానర్ సినిమాలు ఎందుకు ట్రై చేయట్లేదు మీరు?” అనే ప్రశ్న ఎదురయింది. దానికి విశ్వక్ సేన్ సమాధానం ఇస్తూ “నేను హర్రర్ జానర్ సినిమాలు మాత్రం చేయను. ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఈ హర్రర్ జానర్ సినిమాలను చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నేను హర్రర్ కి అసలు భయపడను. అందరూ చాలా భయపడ్డాం అని చెప్పే సినిమాలకు కూడా నేను ఒక్కడినే వెళ్లి చూసి వచ్చాను. ఈ హర్రర్ సినిమాలకు సౌండ్స్ కి నేను ఏమాత్రం భయపడను. ఊరికి చివర్లో ఓ విల్లాలో నన్ను ఒక్కడినే వదిలేసి హర్రర్ సాంగ్స్ పెట్టినా సరే భయపడను. స్మశానంలో సైతం నేనొక్కడినే హ్యాపీగా పడుకోగలను. ఒక దయ్యం మనిషిని చంపింది అనేది రియాలిటీలో ఎక్కడా లేదు. కాబట్టి నేను దయ్యాలకు అసలు భయపడను. అలా భయపడినప్పుడు ఆ జానర్ సినిమా చేయలేను” అని చెప్పారు విశ్వక్ సేన్.
అయితే విశ్వక్ సేన్ (Vishwak Sen) డైరెక్టర్ కూడా కావడంతో “మీరు భయపడనప్పుడు దర్శకుడుగా మీరే ఒక హర్రర్ సినిమాను తీసి ప్రేక్షకులను భయపెట్టొచ్చు కదా” అని అడిగారు. కానీ దానికి కూడా విశ్వక్ సేన్ “నేను చెయ్యను” అని సూటిగా సమాధానం చెప్పారు.