BigTV English

Megastar Chiranjeevi: కాస్త సినిమాను ప్రమోట్ చేయండి బిగ్ బాస్.. మ్యాటర్ గతి తప్పుతోంది!

Megastar Chiranjeevi: కాస్త సినిమాను ప్రమోట్ చేయండి బిగ్ బాస్.. మ్యాటర్ గతి తప్పుతోంది!

Megastar Chiranjeevi: ఎవరు ఒప్పుకున్నా, ఒక్కోకపోయినా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత పెద్దదిక్కుగా వ్యవహరిస్తుంది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. మాటల్లో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఈ మాట చెప్పకపోయినా, చాలామందికి ఈ అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా ఉంది. అయిపోతే మెగాస్టార్ చిరంజీవి చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేస్తారు అనే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. ఒక సినిమా నచ్చిన వెంటనే ఆ చిత్ర యూనిట్ ను ఆహ్వానించి అందరితో మాట్లాడి ఆయన పద్ధతిలోనే చెడు చెవిలో చెప్పి మంచి పదిమందిలో చెపుతారు. ఇదే విషయాన్ని ‘కమిటీ కుర్రాళ్ళు’ దర్శకుడు యాదు వంశీ, ఒక సందర్భంలో చెప్తూ ఈ సినిమాలో ఆయన ఆఫ్ కెమెరా చాలా తప్పులను చర్చించారు అంటూ చెప్పుకొచ్చాడు.


ఇకపోతే ప్రతి చిన్న సినిమాను ఎంకరేజ్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి వస్తూ ఉంటారు. అలా మెగాస్టార్ ఎన్నో చిన్న సినిమా ఈవెంట్స్ కు ముఖ్యఅతిథిగా హాజరై సినిమాలను ప్రమోట్ చేస్తూ వచ్చారు. కాగా వాటిలో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ కూడా సాధించాయి. రీసెంట్ టైమ్స్ లో కూడా మెగాస్టార్ చిరంజీవిని కొన్ని చిత్ర యూనిట్స్ తమ ప్రమోషన్ కు కలిసి వస్తుందని ఆహ్వానించడం జరుగుతుంది. అయితే ఏ సినిమా ప్రమోషన్స్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరైన అక్కడ ఉన్న టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలానే నటుల పేర్లు తెలుసుకొని మరి చెబుతూ ఉంటారు. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోస్ లో కూడా చాలామంది కంటెస్టెంట్లు పేర్లు చిరంజీవి గుర్తు పెట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుగు ఇండియన్ ఐడల్ వంటి షో లో కంటెస్టెంట్లతో చిరంజీవి మాట్లాడిన విధానం కూడా చాలామందికి ఆసక్తికరంగా అనిపించింది.

అయితే మెగాస్టార్ చిరంజీవిలో ఎన్ని విషయాలు పాజిటివ్ గా ఉన్నా కూడా కొన్ని విషయాలు మాత్రం కొద్దిపాటి నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో మెగాస్టార్ చిరంజీవి హాజరైన ప్రతి ఈవెంట్లో రాజకీయ ప్రస్తావాన్ని అవసరం లేకపోయినా తీసుకువస్తున్నారు అని చాలా ఈజీగా అర్థమవుతుంది. విశ్వక్సేన్ నటించిన ‘లైలా’ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా మారింది అంటూ చెప్పుకొచ్చారు. అది కాస్త.. మీడియా, సోషల్ మీడియాలో వేరే రూటులోకి వెళ్లింది. ఇక నిన్న జరిగిన ‘బ్రహ్మానందం’ సినిమా ఈవెంట్ లో కూడా రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హాజరైన ప్రతి ఈవెంట్లో చిన్నదో పెద్దదో రాజకీయ అంశం తీసుకురావడం మాత్రం ఖాయం.


పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తావన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని ఒడిదుడుకులను అడ్డుకొని పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చూశారు. అయితే ఏదైనా ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు రాజకీయ ప్రస్తావన తీసుకురావడం అనేది సాధారణమైన విషయమే, ఇదివరకు భోళాశంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ వంటి సినిమా ఈవెంట్స్ లో కూడా మెగాస్టార్ రాజకీయంగా చాలా వ్యాఖ్యలు చేశారు మాట్లాడారు. అది తన సినిమాకు సంబంధించిన ఫంక్షన్ కాబట్టి పర్వాలేదు అనుకోవచ్చు.

కానీ చిన్న సినిమా చిత్ర యూనిట్స్ మెగాస్టార్ ను పిలిచేదే తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి, అక్కడ కూడా మళ్లీ రాజకీయానికి సంబంధించిన అంశాలు మాట్లాడితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పక్కకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో మెగాస్టార్ రాజకీయంగా మాట్లాడిన మాటలే వైరల్ అవుతున్నాయి తప్ప, సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ పెంచే వీడియోలు ఏవి కనిపించట్లేదు. దీనితో కొద్దిపాటి మంది సినిమా ప్రమోషన్స్ కంటే బాస్ ప్రమోషన్ ఎక్కువైపోతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఇంకో ముందడుగు వేసి మీటర్ తప్పుతున్నావు బాసు, మ్యాటర్ చెప్పు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. పైగా మెగాస్టార్.. అంటే టాలీవుడ్‌కు ఆకాశం లాంటివారు. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే.. ఫోకస్ అంతా ఆయనపైనే ఉంటుంది. మరి, మెగాస్టార్ ఇప్పటికైనా సినిమా ఫంక్షన్లలో సినిమా గురించే మాట్లాడితే బెటర్. లేదంటే.. ఆయన కోసం సోషల్ మీడియాలో కాచుకుకూర్చొన్న వైసీపీ సపోర్టర్లకు దొరికిపోతారు. విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొంటారు. అందుకే, చిరు అభిమానులు కూడా తమ బిగ్ బాస్.. అలాంటి చిల్లర ట్రోల్స్‌కు చిక్కకూడదని కోరుకుంటున్నారు.

Also Read : Anasuya: అనుభవించింది చెప్పాను.. వక్రీకరించొద్దు అంటూ అనసూయ పోస్ట్.. ఏమైందంటే?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×