BigTV English

PCB – IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్.. 30 వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్న పీసీబీ ఛైర్మన్‌!

PCB – IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్.. 30 వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్న పీసీబీ ఛైర్మన్‌!

PCB – IND vs PAK: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేటి {ఫిబ్రవరి 19} నుండి ప్రారంభం కాబోతోంది. మరికొద్ది గంటలలోనే పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇక భారత జట్టు ఈ టోర్నీలో గురువారం నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతోంది. బంగ్లాదేశ్ తో భారత్ తన తొలి మ్యాచ్ ని ఆడబోతోంది. ఇక క్రీడాభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఈనెల 23న జరగనుంది.


Also read: Champions Trophy 2025: నేటి నుండే ఛాంపియన్స్ ట్రోఫీ.. టైమింగ్స్ ఇవే, ఫ్రీగా చూడాలంటే ఎలా?

మొత్తం ఎనిమిది జట్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోరులో.. అంతిమంగా ఓ జట్టు ఛాంపియన్ గా నిలవనుంది. ఈ టోర్నీ లో ఎన్ని మ్యాచులు ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న మ్యాచ్ ఏదంటే.. వెంటనే గుర్తొచ్చే మాట ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్. ఈ ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు సాధారణ ప్రేక్షకులతో పాటు ఏవీఐపీలు, రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, ఇతర సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తారు.


ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు కూడా తమ ప్రాణాలను పెట్టేస్తుంటారు. అందుకే ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే అంత క్రేజ్. ఈ నేపథ్యంలోనే ఐసీసీ కూడా దీనిని అద్భుతంగా క్యాష్ చేసుకుంటుంది. ప్రతి ఐసీసీ ఈవెంట్ లో ఈ రెండు జట్లకు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఉండేలా చూసుకుంటుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కి సంబంధించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్వాహకులు 30 వీఐపీ టికెట్లను ఆఫర్ చేశారు.

అలాగే బీసీసీఐకి కూడా టికెట్లు ఆఫర్ చేశారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మాత్రం తనకు ఆఫర్ చేసిన విఐపి టికెట్లను ఆయన అమ్ముకోవాలని భావిస్తున్నారు. బోర్డు చైర్మన్ అని ఫ్రీగా టికెట్లు ఆఫర్ చేస్తే.. ఇలా అమ్ముకోవడమేంటని అనుకోకండి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆఫర్ చేసిన టికెట్ల ఖరీదు భారత కరెన్సీలో దాదాపు 94 లక్షలు ఉంటుంది.

Also read: BCCI: BCCI కి పెళ్ళాల టార్చర్.. దెబ్బకు వెనక్కి తగ్గారు?

అంత ఖరీదైన టికెట్లను తీసుకుని, వీఐపీ బాక్స్ లో సౌకర్యాలు పొందుతూ భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చూసే బదులు.. ఆ టికెట్లను అమ్ముకునే వచ్చిన డబ్బుతో పాకిస్తాన్ లోని క్రికెట్ స్టేడియాల అభివృద్ధి కోసం ఉపయోగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు సైతం ఆయన తెలియజేశారు. ఇక తాను సాధారణ ప్రేక్షకులతో కలిసి భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తానని తెలిపారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×