BigTV English

Mechanic Rocky : విశ్వక్ మూవీ స్టోరీ లీక్… హిట్ అవ్వడానికి ఇది సరిపొద్దా..?

Mechanic Rocky : విశ్వక్ మూవీ స్టోరీ లీక్… హిట్ అవ్వడానికి ఇది సరిపొద్దా..?

Mechanic Rocky : విశ్వక్ సేన్ కాస్త టెంపర్ ఎక్కువ ఉండే హీరో. సినిమా రిలీజ్ ముందు ఇచ్చే స్పీచ్‌ల వల్ల ఆ సినిమాలపై బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తాడు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాబోయే మెకానిక్ రాకీ మూవీకి కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో “సినిమాకి బజ్ వస్తలేదు బజ్ వస్తలేదు అంటే బజ్ వస్తలేదు కాదు. బజ్ నేను ఇయ్యలేదు. ఈ రోజే ఇద్దామని డిసైడ్ అయి ఉండే. ఇప్పుడు మనం అందరం కలిసి ఇద్దాం బజ్. ఇప్పుడు ఎవడైన బజ్ ఏమైందిరా అంటే వాడికి ఇద్దాం బజ్” అంటూ కామెంట్ చేసి… సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశాడు. అయితే అది అంతగా వర్క్ అవుట్ అయినట్టు లేదు. పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపలేదు. అయితే, ఈ మెకానిక్ రాకీ సినిమా స్టోరీ ఇదే అంటూ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ తర్వాత విశ్వక్ సేన్ చేస్తున్న మూవీ మెకానిక్ రాకీ. ఈ సినిమాను గోపిచంద్ ముళ్లపాడి అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక రోజు ముందుగానే పెయిడ్ షోలు వేస్తున్నట్టు కూడా విశ్వక్ సేన్ ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పాడు. దీంతో సినిమాపై మూవీ టైం చాలా కాన్ఫిడెంట్‌గా ఉందని అర్థమవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ బయటికి వచ్చింది అంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దీని ప్రకారం… సినిమా స్టోరీ ఏంటంటే…

స్టోరీ ఇదే…?


రామకృష్ణ / రాకీ (విశ్వక్ సేన్) చదువల్లో చాలా పూర్. దీంతో తన తండ్రి నడుపుతున్న మెకానిక్ షాప్‌లో హీరోకు ఇష్టం లేకున్నా… మెకానిక్ అవుతాడు. తర్వాత మెకానిక్ గా చేయడం ఇష్టం లేకపోవడంతో డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేస్తాడు. ఈ క్రమంలో ఇతని వద్దకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షీ చౌదరి వస్తారు. ఆ ఇద్దరితో హీరో లవ్ ట్రాక్ నడుస్తుంది. అంతా బాగా ఉన్న టైంలో విలన్ ఏంట్రీ ఉంటుంది. సునీల్ ఈ మూవీలో రంకీ రెడ్డి అనే పేరుతో విలన్ పాత్రలో కనిపించాడు. ఓ సందర్భంలో విలన్‌తో రాకీ ఢీ కొట్టాల్సి వస్తుంది. ఇదేే మెకానిక్ రాకీ మూవీ స్టోరీ అని ఇండస్ట్రీ టాక్ నడుస్తుంది.

ఇలా అయితే కష్టమే…

అయితే ఈ స్టోరీపై ప్రస్తుతం ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఓల్డ్ స్టోరీ అని ఆడియన్స్‌కు పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేదని అని కూడా టాక్ వస్తుంది. ముఖ్యంగా సునిల్ చేస్తున్న విలన్ రోల్ పై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. హీరో – విలన్ మధ్య వచ్చే సీన్స్‌లో కొత్త దనం లేదని ట్రైలర్ చూస్తునే అర్థమవుతుందని అంటున్నారు. చూడాలి మరీ.. ఈ స్టోరీ నిజమే అయితే, థియేటర్స్‌లో ఎలా ఆడుతుందో… ఎలా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో.

హీరో కాన్ఫిడెంట్… 

కానీ, సినిమాపై హీరో విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. రిలీజ్ కి ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ కూడా వేస్తున్నట్టు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే, ఒక రోజు ముందు చూసిన తర్వాత సినిమా నచ్చకుంటే చూడకండి అంటూ కూడా విశ్వక్ సేన్ కామెంట్ చేశాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×