Gangs Of Godavari Teaser: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించకున్నా హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్. సినిమా సినిమాకి డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. కొత్త కొత్త కాన్సెప్టులను ఎంచుకుంటూ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది ‘గామి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
గత ఆరేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఒక చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు మరొక కొత్త మూవీతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ చేస్తున్నాడు.
ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి మరొక అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ఈ మేరకు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తాజాగా ఈ టీజర్ రిలీజ్‌కు సంబంధించి ఓ అప్డేట్‌ను అందించారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను రేపు సాయంత్రం 4.01 గంటలకు ఏఎంబీ సినిమాస్ స్క్రీన్ 1లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ఊపుతెప్పిస్తున్న మోత సాంగ్.. జోడీ భలే ఉంది!
దీంతో ఈ టీజర్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో నటి అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ఓ వైపు సినిమాలో హీరోగా చేస్తూ.. మరోవైపు దర్శకునిగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఫలక్‌నుమా దాస్, ధమ్కీ చిత్రాలకి హీరో కమ్ దర్శకునిగా చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు.
https://twitter.com/SureshPRO_/status/1783808173813432403