Big Stories

Hyundai EV : హ్యుందాయ్ క్రెటా నుంచి EV.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిమీ రేంజ్!

Hyundai EV : దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతుంది. ఈవీ సెగ్మెంట్‌లో లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు ఎంట్రీ ఇచ్చి ఈ పోటీని మరింతగా పెంచాయి. ప్రభుత్వాలు కూడా ఈవీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కొరియన్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియా దేశంలో మొట్టమొదటి ఈవీ కారును తీసుకురాబోతుంది.

- Advertisement -

అంతేకాకుండా 2023 నాటికి ఐదు హ్యుందాయ్ ఈవీలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దేశంలో తయారైన కంపెనీ మొట్టమొదటి ఈవీని 2025 నాటికి దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. చెన్నై సమీపంలో కొత్త కార్ల తయారీ యూనిట్‌ను హ్యుందాయ్ ఏర్పాటు చేయనుంది. ఈ కారు పూర్తి వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

Also Read : దేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు.. టాప్‌ ప్లేసులో ఇవే!

హ్యుందాయ్ తన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు క్రెటా ఈవీని లాంచ్ తీసుకురానుంది. ఈ కారును ఇప్పటికే చాలా ప్రదేశాల్లో టెస్ట్ చేశారు. క్రెటా కంపెనీకి చెందిన ప్రముఖ మోడళ్లలో ఒకటి. అదే సమయంలో Creta EV కూడా మార్కెట్‌లో గట్టిపోటీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారు స్పెసిఫికేషన్లకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ హ్యుందాయ్ ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జింగ్‌లో 400 నుండి 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సమాచారం.

దేశీయ ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. హ్యుందాయ్‌తో పాటు, కియా కూడా భామేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తుంది. కియా సెల్టోస్ ఈవీని కూడా ఇప్పటికే పరీక్ష సమయంలో గుర్తించబడింది. హ్యుందాయ్, కియా రెండు కంపెనీల ఎలక్ట్రిక్ కార్లలో మెరుగైన పవర్‌ట్రెయిన్‌లను ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ కార్లు పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి రావచ్చు.

Also Read : ల్యాండ్ రోవర్ నుంచి పవర్ ఫుల్ ఎస్‌యూవీ.. జూలైలో లాంచ్!

మేడ్ ఇన్ ఇండియా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ఈవీ రెండూ రూ. 20 లక్షల నుండి రూ. 30 లక్షల పరిధిలో రావచ్చు. ఈ కారు ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీని ఇవ్వగలదు. ప్రస్తుతం, టాటా, MG వంటి అనేక పెద్ద కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News