Big Stories

Gangs of Godavari’s Song: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ఊపుతెప్పిస్తున్న మోత సాంగ్.. జోడీ భలే ఉంది!

Gangs of Godavari
Gangs of Godavari

Ayesha Khan Motha Song from Vishwak Sen Gangs of Godavari Out Now: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నటుడు విశ్వక్ సేన్ ఒకడు. అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.

- Advertisement -

ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు దర్శకునిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా గామి మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో అఘోరా పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఈ మూవీలో విశ్వక్ సేన్‌కు జోడీగా చాందినీ కథానాయికగా నటించింది.

- Advertisement -

ఇటీవలే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సైతం నమోదు చేసింది. ఇక ఈ మూవీ తర్వాత విశ్వక్ సేన్ మరో మూవీతో బిజీగా ఉన్నాడు.

ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో మాస్ రోల్‌లో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీపై కూడా ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: రహస్యంగా అతడిని పెళ్లి చేసుకున్న తాప్సి.. నెట్టింట ఫోటోలు వైరల్

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై ఫుల్ హైప్ పెంచేశాయి. ముఖ్యంగా ఈ మూవీ నుంచి ఇదివరకే రిలీజ్ అయిన సుట్టమల సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంది. ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోయింది. యూట్యూబ్‌లో దాదాపు 50 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుని చార్ట్ బస్టర్‌గా నిలిచింది.

ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించిన చిత్ర బృందం.. ఇప్పుడు ప్రమోషన్స్‌ను జోరుగా సాగిస్తుంది. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్‌ను అందించింది. ఈ మేరకు మరో సాంగ్‌ను రిలీజ్ చేసి హోలీ ట్రీట్ అందించింది.

తాజాగా ఈ సినిమా నుండి ‘మోత’ అనే మరో అద్భుతమైన సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకాభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. హూలీ సందర్భంగా రిలీజ్ అయిన ఈ పాట నిజంగానే మోత మోగించేస్తుంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం ఈ సాంగ్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లిందనే చెప్పాలి.

Also Read: గల్లీలో ‘ఫ్యామిలీ స్టార్’ హోలీ సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన మృణాల్, విజయ్

దీని బట్టి చూస్తుంటే ఈ స్పెషల్ సాంగ్ థియేటర్‌లలో మోత మోగించేయటం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సాంగ్‌లో అందాల ముద్దుగుమ్మ అయేషా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశ్వక్ సేన్‌తో పాటు మోత సాంగ్‌కు దుమ్ము దులిపేసింది.

ఇకపోతే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి కీలక పాత్రలో చేస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్‌లపై ప్రముఖ నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ మే 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News