Big Stories

Indian Origin: అమెరికాలో దారుణం.. భారత సంతతి వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు..?

Indian-Origin Man Shot Dead by US Police: అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శాన్ అంటోనియోలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. ఓ కేసులో అనుమానితుడిగా ఉన్న ఆ వ్యక్తిని యూఎస్ పోలీసులు తుపాకీతో కాల్చిచంపారు.

- Advertisement -

అమెరికాలోని శాన్ అంటోనియోలో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ సాహు అనే 42 ఏళ్ల వ్యక్తిని అమెరికా పోలీసులు కాల్చిచంపారు. ఓ మహిళను కారుతో ఢీకొట్టిన కేసులో అనుమానితుడిగా ఉన్న సాహును అరెస్ట్ చేయడానికి వచ్చిన ఇద్దరు పోలీసులు అధికారులను.. అతను కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించగా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. అయితే ఆ కాల్పుల్లో సచిన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు యూఎస్ పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

యూఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాన్ అంటోనియో పోలీసులకు ఈ నెల 21న ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. చెవియట్ హైట్స్ ప్రాంతంలోని ఓ ఇంటివద్ద గుర్తు తెలియని వ్యక్తి మారణాయుధంతో సంచరిస్తున్నాడంటూ పోలీసులకు వెల్లడించాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

పోలీసులు అక్కడికి వెళ్లేసరికి కారుతో ఢీకొట్టడంతో ఓ 51 ఏళ్ల మహిళ గాయాలతో వారికి కనిపించింది. అయితే ఈ ప్రమాదం కేసులో పోలీసులు సచిన్ సాహును అనుమానితుడిగా గుర్తించారు. దీంతో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అక్కడి నుంచి పరారైన సాహు.. కొన్ని గంటల తర్వాత ప్రమాదం జరిగిని ప్రాంతానికి మరలా వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు. సాహును అరెస్ట్ చేసేందుకు ఇద్దరు పోలీసులు వెళ్లగా.. వారిని కూడా కారుతో ఢీకొట్టి చంపడానికి సాహు ప్రయత్నించాడు. దీంతో ఓ పోలీసు అధికారి తన తుపాకీతో సాహుపై కాల్పులు జరిపగా.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read: యూఎస్‌లో భారత సంతతి విద్యార్థి అరెస్ట్, ఆ పై నిషేధం.. అందుకేనా..?

సాహు కారుతో ఢీకొట్టిన మహిళ అతని రూమ్ మేట్ అని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గత పదేళ్లుగా సాహా బైపోలార్ డిజాస్టర్ తో బాధపడుతున్నట్లు అతని మాజీ భార్య లీ గోల్డ్ స్టీన్ పోలీసులతో వెల్లడించారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News