BigTV English
Advertisement

 Vishwak Sen : పోస్ట్ పెట్టడం.. డిలీట్ చేయడం.. ప్రమోషనల్ స్ట్రాటజీనా?

 Vishwak Sen : పోస్ట్ పెట్టడం.. డిలీట్ చేయడం..  ప్రమోషనల్ స్ట్రాటజీనా?
Vishwak Sen

Vishwak Sen : సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా విభిన్నమైన కథలతో మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి విశ్వక్ సేన్. విశ్వక్, నేహా శెట్టి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా ఇందులో విశ్వక్, నేహా కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో ఎందుకో విశ్వక్ తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

సోషల్ మీడియా సాధనంగా ఉపయోగించి అవతల వాళ్ళ పై విరుచుకు పడడం విశ్వక్ మొదటి నుంచి అలవాటు. చాలా సందర్భాలలో అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లు వివాదాలకు దారి తీసాయి. ముందుగా ఆలోచించకుండా ఏది తోస్తే అది రాస్తూ.. నిక్కచ్చిగా మాట్లాడడం విశ్వక్ కి మొదటి నుంచి అలవాటు. ఇదే తీరులో అతను తన మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ విషయంపై సోషల్ మీడియాలో మరోసారి ఫైర్ అయ్యాడు.


ఇంతకీ విషయం ఏమిటంటే అతని మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్న విషయం క్లారిటీగా తెలియడం లేదు. మొదట డిసెంబర్ 8న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 29 లేక జనవరిలో విడుదల ఉంటుంది అని అంటున్నారు. దీనికి కారణం మధ్యలో వస్తున్న చిత్రాలే. ఈ నేపథ్యంలో కావాలని తన మూవీని వెనక్కి నడుతున్నారు అని భావించిన విశ్వక్ సోషల్ మీడియా సాక్షిగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే ఈ మాస్ హీరో తన బాధను కూడా మంచి మాస్ స్టైల్ లో వ్యక్తీకరించడం మరొక కాంట్రవర్సీకి దారి తీసేలా ఉంది.

“బ్యాక్ గ్రౌండ్ లేదు అంటే ..ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దాం అని అనుకుంటాడు. ప్రతి ఒక్క ఫ్రేమ్లో ప్రాణం పెట్టి చేశాను.. డిసెంబర్ 8న వస్తున్నాను.. హిట్ ఫ్లాప్ సూపర్ హిట్ అట్టర్ ఫ్లాప్ ఏదైనా మీ డెసిషన్. ఆవేశానికి లేదా ఈగో కో తీసుకున్న డెసిషన్ కాదు. తగ్గే కొద్ది మింగుతారు అని అర్థం అయింది. డిసెంబర్ 8న శివాలెత్తి పోద్ది, గంగమ్మ తల్లికి నా ఒట్టు, మహాకాళి మాతోటే ఉంది.. డిసెంబర్ కాకపోతే ఇక నన్ను మీరు 

#GOG ప్రమోషన్స్ లో చూడరు..”అంటూ ఒక పెద్ద మాస్ డైలాగ్ రాసి వదిలాడు. ప్రస్తుతం అతని మాటలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

డిసెంబర్ 7, 8 తేదీలను టార్గెట్ చేసుకొని చాలా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. వాటిలో నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. ముఖ్యంగా లైన్లో ఉన్నాయి. అందుకే విశ్వక్ సినిమా వాయిదా వేద్దామని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఎవరన్నా మూవీ పోస్ట్ ఫోన్ చేయమని ప్రెషర్ పెట్టారేమో అందుకే విశ్వక్ అంతగా రియాక్ట్ అయ్యాడు అన్న వాదన అక్కడక్కడ వినిపిస్తోంది. అయితే పోస్ట్ చేసిన కొంత సమయం తర్వాత ఆ ట్వీట్ ని డిలీట్ కూడా చేశాడు. విశ్వక్ మామూలుగా చేసే ప్రమోషనల్ స్టంట్ అంటూ కొందరు విమర్శిస్తుంటే మరికొందరు పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయం ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×