Mechanic Rocky OTT: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తాడు.. ఈ ఏడాది వచ్చిన రెండు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఆయన నుంచి మూడో సినిమాగా’ మెకానిక్ రాకీ ‘ సినిమా వచ్చింది. ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చేసింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో విష్వక్ సేన్‌కి జంటగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ నటించగా, రామ్ తుళ్లూరి నిర్మించారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుందని తెలుస్తుంది. ఇక కలెక్షన్స్ కూడా ఆశించిన మేర రాలేదని తెలుస్తున్నాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ఓటీటీ అప్డేట్స్ వచ్చేసాయి. ఈ మూవీ ఏ ఓటీటీ లోకి రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మూవీ నుంచి విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్, పోస్టర్లను చూస్తే.. ఇది ట్రైయాంగిల్ లైవ్ స్టోరీగా అనిపించింది. కానీ.. ఊహించని ట్విస్ట్‌లతో సెకండ్ హాఫ్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రవితేజ ముళ్లపూడి మార్చేశారు. అయితే.. ఫస్ట్ హాఫ్‌లో సాగదీతతో బోర్‌గా ఫీల్ అయ్యామని పబ్లిక్ రివ్యూ ఇచ్చారు. అయితే అంతా బాగానే ఉన్నా కూడా ఎక్కడో ఎదో మిస్ అయ్యిందనే ఫీలింగ్ జనాలకు కలిగిందని తెలుస్తుంది. మొత్తానికి అయితే సినిమా బ్లాక్ బాస్టర్ అనే టాక్ ను అందుకోలేదు కానీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమా భారీ ధరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓపెనింగ్స్ ఏ మాత్రం జరిగాయో తెలియాల్సి ఉంది.
‘ మెకానిక్ రాకీ ‘ ఓటీటీ డీటెయిల్స్..
విశ్వక్ మెకానిక్ రాకీ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్ ఫ్యాన్సీ ధరకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమా రిలీజైన నాలుగు వారాల లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఈ లెక్కన డిసెంబరు చివర్లో లేదా జనవరి మొదటి వారంలో మెకానిక్ రాకీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఒకవేళ సినిమా ఎక్కువ రోజులు థియేటర్ల లో సరిగ్గా ఆడక పోతే వెంటనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ వార్త వినిపిస్తుంది.. ఈ మూవీ హీరోయిన్ మీనాక్షి చౌదరి మాత్రం వరుస సినిమాల తో దూసుకుపోతుంది. ఈ ఏడాదిలో నెలలోపే మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు అన్ని మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం టాప్ లో ఉంది. రష్మిక మందన్న ను పక్కన పెట్టేసేలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారని టాక్..