BigTV English

Vishwambhara – Chiranjeevi: చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే

Vishwambhara – Chiranjeevi: చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే

vishwambhara release date (today tollywood news):


మెగాస్టార్ చిరంజీవి హీరోగా 68 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలలో దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవలే దర్శకుడు మెహర్ రమేష్‌ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ మూవీ చేశాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా పరాజయంపాలైంది. అంతేగాక ఈ సినిమా ఇటు చిరుకి, అటు డైరెక్టర్‌కి కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి.

దీంతో చిరు తన తదుపరి సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన వద్దకు వస్తున్న కథలలో డిఫరెంట్‌గా ఏది ఉంటే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల ఓ మూవీకి ఓకే చెప్పాడు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వశిష్టతో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఇటీవల ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా.. ఎన్నో థ్రిల్లింగ్ సన్నివేశాలతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు బయట ఫుల్ టాక్.


chiranjeevi
Vishwambhara release date

దర్శకుడు వశిష్ట ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన హీరోయిన్ త్రిష సహా మరో ఇద్దరు భామలు నటిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అంతేగాక ఈ మూవీలో మరో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరు.. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి సినిమాల తర్వాత నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. అందువల్ల ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీలో చిరుని ఢీకొట్టేందుకు కోలీవుడ్ స్టార్‌ హీరోను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరో శింబు ఇందులో విలన్ పాత్రలో నటించబోతున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ విని చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేసాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ అందించారు.

ఈ మేరకు మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. 2025 జనవరి 10న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉందని ప్రకటించారు. ఈ మేరకు అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎప్పుడైతే అద్భుత శక్తులు కలుస్తాయో.. అప్పుడు ఒక లెజెండ్ అదే అద్భుత వ్యక్తి పుట్టుకొస్తాడు అనే అర్థంలో ఒక కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ అప్డేట్‌తో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×