BigTV English

Hala Mobility : హాలా.. ఆలోచన భళా..!

Hala Mobility : హాలా.. ఆలోచన భళా..!

 Hala Mobility


Hala Mobility : చదువు తర్వాత ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకున్నాడు. యూత్ ఆలోచనలకు తగిన, వారి అవసరాలు తీర్చే ట్రెండీ బిజినెస్ అయితే.. బాగుంటుందనిపించింది. ఎలక్ట్రిక్ బైక్‌ల వాడకం పెరుగుతోంది కాబట్టి అదైతే సక్సెస్ అవుతుందని నమ్మాడు. ఒకేసారి అధిక ధర పెట్టి ఆ వాహనాలు కొనటం కంటే అద్దెకు దొరికితే బాగుంటుందనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని సర్వేలో తేలటంతో ‘హాలా’ పేరుతో స్టార్టప్ పెట్టేశాడు. మొదట్లో సమస్యలొచ్చినా.. క్రమంగా పుంజుకుని నేడు వందలమందికి ఉపాధికల్పిస్తున్నాడు. అతడే.. హాలా వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్‌ రెడ్డి కలకొండ.

ప్రస్థానం
శ్రీకాంత్ బీటెక్‌ తర్వాత విదేశాల్లో మాస్టర్స్ చేశారు. అది పూర్తికాగానే ‘షేర్డ్‌ మొబిలిటీ’ అనే అంశంపై పీహెచ్‌డీ కూడా పూర్తయింది. ఈ టైంలోనే అక్కడి ఎలక్ట్రిక్ వాహనాల ఫీచర్స్, వాడకం, వాటి అవసరం, రవాణా నమూనాల మీద అధ్యయనం చేశాడు. హైదరాబాద్ తిరిగొచ్చాక.. ఇక్కడి ట్రెండ్ మీద సర్వే చేశారు. 2019లో సహ వ్యవస్థాపకులుగా ఆనంద్‌ పరీక్‌, స్నేహిత్‌ రెడ్డి మేడ అనే మరోఇద్దరిని కలుపుకుని హాలా (స్పానిష్‌లో అద్భుతం అని అర్థం) మొబిలిటీ అనే స్టార్టప్ పెట్టేశారు.
సొంత పెట్టుబడితో పని ఆరంభించి, 2020 నవంబరు నాటికి హైదరాబాద్ మెట్రో స్టేషన్ల వద్ద ఇ-స్కూటర్లను అద్దెకివ్వటం మొదలుపెట్టారు. క్రమంగా 150 మంది డెలివరీ బాయ్స్‌ను తీసుకుని, వారికి ఇ-స్కూటర్లు ఇచ్చి, ఇ-కామర్స్‌ సంస్థల వారి డెలివరీలు అందించారు.

అయితే.. ఖర్చులు, నిర్వహణ కష్టం కావటంతో రూటు మార్చి, సొంత సిబ్బందిని తీసుకోకుండా ఇ-కామర్స్‌ సంస్థల డెలివరీ సిబ్బందికి వాహనాలు అందించటం మొదలుపెట్టారు.గుర్తింపు రావటంతోనే వ్యాపార నిర్వహణ, విస్తరణ కోసం టి-హబ్‌కు చెందిన టి-ఏంజెల్స్‌ నుంచి రూ.8 కోట్ల పెట్టుబడులు, తాజాగా మరో రూ.8 కోట్లు సమకూరాయి. టి-హబ్‌‌లో ఆఫీసు పెట్టినరోజు 20 సొంత ఎలక్ట్రిక్ బైక్‌లతో సేవలు మొదలుపెట్టగా, నేడు ఇది 2000 వాహనాలకు చేరింది.


వచ్చే ఏడాది నాటికి వీటి సంఖ్య 5 వేలు కానుంది. ప్రస్తుతమున్న 78 మంది ఉద్యోగులు.. వచ్చే ఏడాదికి 160 కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖపట్టణం, చెన్నై, ముంబయి, పుణెల్లోనే ఉన్న హాలా ఇతర నగరాల దిశగా అడుగులు వేయనుంది. వ్యక్తిగత అవసరాలకే గాక.. సరకు రవాణాకు విద్యుత్‌ ఆటోలను, అద్దె కార్లను అందుబాటులోకి తెచ్చే దిశగా హాలా దూసుకెళుతోంది. ఈ నెలాఖరు (సెప్టెంబరు 30) నాటికి మరో రూ.65 కోట్లు సమీకరించే లక్ష్యంతో హాలా దూసుకెళుతోంది.

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×