BigTV English

Vishwambhara: బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పండగ షురూ చేయండ్రా

Vishwambhara: బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పండగ షురూ చేయండ్రా

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. బింబిసార సినిమాతో  మంచి హిట్ కొట్టిన వశిష్ఠ  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాలో చిరు సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష నటిస్తోంది.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతుందని మేకర్స్ ముందే ప్రకటించారు.


అయితే గత కొన్ని రోజుల నుంచి సంక్రాంతి రేస్ నుంచి విశ్వంభర తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇక ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే రోజు రానే వచ్చింది. పండగ ఏదైనా.. చిరు సినిమా అప్డేట్ వస్తే ఆ కిక్కే వేరని చెప్పాలి. రేపు దసరా కావడంతో.. మేకర్స్ విశ్వంభర నుంచి బిగ్ అప్డేట్ రానున్నట్లు ప్రకటించారు. అదేంటంటే.. రేపు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన అందించారు.

రేపు ఉదయం 10. 49 నిమిషాలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిరు.. చేతిలో కత్తి పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించాడు. ఇక వెనుక బ్యాక్ గ్రౌండ్ లో విఎఫ్ఎక్స్ అదిరిపోయింది. పోస్టర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.


అందుతున్న సమాచారం ప్రకారం.. చిరు నటించిన యముడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి  సినిమాల కలయికగా విశ్వంభర ఉండనున్నట్లు తెలుస్తోంది. చిరు ఇలాంటి పత్రాలు చేసి చాలా కాలమయ్యింది. దీంతో ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలీవుడ్ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.

ఇక ఈ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ విషయంలో కూడా మేకర్స్ ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా  సంక్రాంతి  బరిలో దిగుతుందా.. ? లేక వాయిదా పడుతుందా.. ? అనేది  తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×