BigTV English

Viswaksen : విశ్వక్ సేన్ సినిమాలకే వివాదాలు.. ఎక్కడో తేడా కొడుతుందే..?

Viswaksen : విశ్వక్ సేన్ సినిమాలకే వివాదాలు.. ఎక్కడో తేడా కొడుతుందే..?

Viswaksen : టాలీవుడ్ మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ విభిన్న కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. గతఏడాది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అందులో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని అందుకున్నాయి. చివరగా మెకానిక్ రాఖీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ యావరేజ్ టాక్ ని అందుకోవడంతో ఇప్పుడు విశ్వక్సేన్ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లైలా సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు విశ్వక్సేన్. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు 30 ఇయర్స్ పృధ్విరాజ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.. దాంతో ఈ సినిమాని బాయ్ కట్ చయాలని వైసిపి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.


అయితే ఇప్పుడు మరో వార్త చర్చనీయాంశంగా మారింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఒక్కొక్క యూనిట్ ఒక్కో విధంగా ప్రమోషన్స్ చేస్తారు. కానీ విశ్వక్సేన్ సినిమాలకు మాత్రం ప్రమోషన్స్ వేరే లెవల్ అని చెప్పాలి. గతంలో కొన్ని సినిమాలకు గొడవలతో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు.. సినిమాలకు మాత్రం పెద్దగా కష్ట పడకుండానే పబ్లిసిటీ అవుతుంది. సరిగ్గా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ జరిగి, ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. తాజాగా లైలా విషయంలోనూ అదే జరిగింది. 2019 లో వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్’ మొదలు కొని, ఈ ఫిబ్రవరి 14న విడుదల కానున్న ‘లైలా’ వరకు వరుసగా వివాదాలు పలకరించాయి. ఆయన సినిమాల విడుదలకు ముందు ఏదో ఒక వివాదం జరుగుతూనే వచ్చింది. ఒక సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియో చేయగా అది వైరల్ అయింది. అదేవిదంగా ఆ ప్రాంక్ వీడియోపై ఒక టీవీ యాంకర్ తో విశ్వక్ కి గొడవ జరిగింది. అప్పటిలో ఇది కాస్త వైరల్ గా మారింది. స్టూడియోకు ఇంటర్వ్యూ కు పిలిచి అవమానిస్తారా అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.

ఇక ఇప్పుడు లైలా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరో వివాదానికి తెర లేపారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. 150 మేకలలో 11 మేకలే మిగిలాయి అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇవి పరోక్షంగా వైసీపీ సీట్లపై చేసిన కామెంట్స్ లా ఉండటంతో వైసీపీ అభిమానులు పృథ్వి రాజ్ ను క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.. అలాగే ఈ లైలా మూవీని తొలగించాలని బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. లైలా విషయంలో అయితే తను ఏం కామెంట్స్ చేయకుండానే కాంట్రవర్సీ అయింది. దీంతో విశ్వక్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. క్షమాపణలుకూడా చెప్పాడు. కానీ, నిజానికి ఈ కాంట్రవర్సీ వల్ల లైలా కే ప్లస్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వివాదాలతో కూడిన పబ్లిసిటీ ఈ సినిమాకు లాభమా నష్టమా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా తెలియాలంటే ఒక్కరోజు వెయిట్ చేయాల్సిందే..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×