OTT Movie : అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాత్రల చేత, ప్రేమలో ఎదురయ్యే సమస్యలపై సందేశాలిస్తూ సినిమాలు తీస్తున్నారు కొంతమంది దర్శకులు. కాలం మారిపోయినా ఇంకా పాతకాలపు ఫార్ములాలనే నమ్మి, ఈ కాలపు ప్రేక్షకుల మీద ఇటువంటి సినిమాలు రుద్దుతున్నారు. వాటిలో కులాల సమస్య తో అడపాదడపా సినిమాలు వస్తూనే వున్నాయి. దాన్ని సక్సెస్ ఫార్ములాగా నమ్మి ఇప్పుడు సినిమాలు తీస్తున్నా, కొన్ని మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీలో తక్కువ కులం కారణంగా, కూతురి ప్రేమను తండ్రి తిరస్కరిస్తాడు. ఆతరువాత ఈ జంట ఎదుర్కొనే సమస్యలతో స్టోరీ నడుస్తుంది. ఈ లవ్ స్టోరీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ లవ్ స్టోరీ మూవీ పేరు ‘మది’ (Madhi). 2022 నవంబరు 11న విడుదలైన ఈ తెలుగు సినిమాకి నాగ ధనుష్ దర్శకత్వం వహించాడు. ప్రగతి పిక్చర్స్ బ్యానరులో రామ్ కిషన్ ఈ మూవీని నిర్మించగా, పివిఆర్ రాజా సంగీతం అందించాడు. ఈ సినిమాలో శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అభి, మధు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకరోజు అభి ఫ్రెండ్ రవి, ఒక అమ్మాయితో ఏకాంతంగా గడుపుతాడు. అభి పక్కనే ఉండి ఎవరూ రాకుండా చూస్తాడు. అది చూసి అభి కూడా అలా చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే ప్రేమించిన మధు తో ఏకాంతంగా గడుపుతాడు. ఆ తర్వాత అభికి వైజాగ్ లో జాబ్ వస్తుంది. జాబ్ కి వెళ్లి, కొత్త బైక్ మీద తిరుగి వచ్చి, మధు తండ్రితో తనని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. కులాలు వేరు కావడంతో, ఆ పెళ్లికి మధు తండ్రి ఒప్పుకోడు. ఈ పెళ్లి చేసుకోకపోతే అభిని చంపేస్తారని భయపడుతుంది మధు. ఆ తర్వాత మధు కి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు ఆమె తండ్రి. అలా మధుకి పెళ్లి కూడా అయిపోతుంది. అభి వైజాగ్ కి వెళ్ళిపోతాడు. మధు పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా వైజాగ్లో జాబ్ చేస్తూ ఉండటంతో, మధు కూడా వైజాగ్ కి వస్తుంది.
వీళ్ళంతా ఓకే కాలనీలో ఉంటారు. భర్త ఆఫీస్ కి వెళ్ళాక, అభి ఇంటికి మధు వస్తూ ఉంటుంది. భర్తను వదల లేక, ప్రియుడుతో గడపలేక తను కూడా బాధపడుతూ ఉంటుంది. అభి కూడా మధుని మరచిపోవడానికి విదేశాలకు వెళ్లిపోవాలనుకుంటాడు. చివరికి మధు తన భర్తతోనే ఉంటుందా? అభి విదేశాలకు వెళ్లిపోతాడా? ఈ ప్రేమకి ముగింపు ఎలా పడుతుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మది’ (Madhi) అనే ఈ మూవీని మిస్ కాకుండా కాకుండా చూడండి.