Viswam Collections : ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల (Srinu vaitla) దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichandh ) తాజాగా నటించిన చిత్రం విశ్వం (Viswam). కావ్య థాపర్ (Kavya thapar) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 11వ తేదీన థియేటర్లలో దసరా పండుగ సందర్భంగా విడుదలయ్యింది. విడుదలైన మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. రొటీన్ కథనే డైరెక్టర్ శ్రీను వైట్ల తీసాడని చాలామంది విమర్శించారు. అవుట్ డేటెడ్ కథే అయినా కొన్నిచోట్ల బాగానే వర్క్ అవుట్ అయింది.. ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. కానీ పోస్టర్ మాత్రం వేయలేదు.. సాధారణంగా హిట్ అయినప్పుడు లేదా హిట్ చేయాలనుకున్నప్పుడు, కోట్లకు కోట్లు వచ్చినప్పుడు మాత్రమే సినిమా పోస్టర్లు వేస్తారు. అయితే ఒకసారి చిన్న చిత్రాలు పెద్ద విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో కూడా చాలామంది పోస్టర్లు వేసుకుంటారు.
డిజాస్టర్ తప్పదా..
కానీ విశ్వం సినిమా మాత్రం భారీగా డిజాస్టర్ గా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పోస్టర్ వేయలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వారం రోజుల కలెక్షన్లను చూస్తే మాత్రం నిజంగా ఇది అనిపించక మానదు. నిజానికి ఎంత నాసిరకంగా సినిమా కథ ఉన్నప్పటికీ కూడా కొన్నిచోట్ల కామెడీ వర్కౌట్ అవ్వడంతో ఒకసారి చూడొచ్చు అనే లాగా జనాలు ఈ దసరా సెలవల్లో థియేటర్లకు వెళ్లి వచ్చారు. అలా మొత్తంగా ఈ వారం కాస్త ముగిసిపోయింది. మరి మొదటివారం ముగిసే సరికి ఈ సినిమా ఎంత కలెక్షన్ వసూలు చేసింది..? అసలు ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంత..? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ప్రాంతాలవారీగా విశ్వం సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్లు..
నైజాం – రూ. 1.18 కోట్లు
సీడెడ్ – రూ.0.49 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.0.54 కోట్లు
ఈస్ట్ – రూ.0.11 కోట్లు
వెస్ట్ – రూ.0.16 కోట్లు
గుంటూరు – రూ.0.42 కోట్లు
కృష్ణా – రూ.0.45 కోట్లు
నెల్లూరు – రూ. 0.15 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్) – రూ. 3.60 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.0.29 కోట్లు
ఓవర్సీస్ – 0.27 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ గా రూ.4.16 కోట్లు
హీరోగా బుట్ట సర్దే సమయం వచ్చిందా..
అలా ‘విశ్వం’ చిత్రానికి రూ.12.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ చిత్రం రూ.4.16 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.8.84 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక హాలిడేస్ కూడా ముగిసిపోయాయి అసలు సెలవు రోజుల్లోనే కలెక్షన్లు రాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కలెక్షన్లు వస్తాయన్న ఆలోచన కూడా లేకుండా పోయింది. మొత్తానికి అయితే ఈ సినిమాను కొన్న బయ్యర్స్ భారీగా నష్టపోయారని చెప్పవచ్చు. ఏది ఏమైనా హీరోగా బుట్ట సర్దే సమయం వచ్చింది అంటూ హీరో గోపీచంద్ పై కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.