BigTV English

Sundaram Master OTT: రెండు ఓటీటీల్లోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Sundaram Master OTT: రెండు ఓటీటీల్లోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Sundaram Master OTT release date


Sundaram Master OTT release date(Today tollywood news): టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వైవా హర్ష పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ తన కామెడీ పంచ్‌ డైలాగ్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లు చేస్తూ అందరినీ అలరించాడు. తన వాయిస్‌తో కూడా ఎంతో మందిని ఫ్యాన్స్‌గా మార్చుకున్నాడు. ఇక ఎప్పుడూ ఫ్రెండ్ క్యారెక్టర్లేనా.. ఈ సారి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అని నిర్ణయించుకున్నాడు హర్ష.


ఇందులో భాగంగానే ఇతర కమెడియన్ల మాదిరిగానే హీరో రోల్‌పై ఫోకస్ పెట్టాడు. అయితే ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు హీరోలుగా మారి మంచి సక్సెస్‌లు అందుకున్నారు. సునీల్, సత్యం రాజేష్, సుహాస్, సుడిగాలి సుధీర్, శకలక శంకర్, సప్తగిరితో సహా మరికొంత మంది నటులు హీరోలుగా మారి మంచి హిట్లను అందుకున్నారు.

READ MORE: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి స్టార్ హీరోల సినిమాలు.. ఇదిగో లిస్ట్

ఇక ఇప్పుడు అదే బాటలోకి వైవా హర్ష వచ్చి చేరాడు. అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ చిత్రం ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. కాగా ఈ చిత్రానికి మాస్ మాహారాజ్ రవితేజ నిర్మాతగా వ్యవహరించారు.

మొదటి నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్లు, టీజర్‌ సహా ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. దీంతో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, నాగచైతన్య వంటి హీరోలు సైతం ఈ మూవీపై ఫుల్ హైప్ క్రియేట్ చేశారు. ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాపై మరింత బజ్‌ను క్రియేట్ చేశారు.

అలాంటి అంచనాలతో ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఇందులో హర్ష ఎప్పటి లాగానే తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను నవ్వించిపడేశాడు. అంతేకాకుండా ఈ మూవీ తక్కువ బడ్జెట్‌తో రూపొందడంతో మంచి లాభాలనే రాబట్టినట్లు తెలుస్తోంది.

READ MORE: థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రాలు.. ఈ రోజు టీవీల్లోకి వచ్చేస్తున్నాయ్

ఇక థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా రెండు స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఆహాతో పాటు ఈటీవీ విన్‌లో ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం.. మార్చి 21 లేదా 22 నుంచి సుందరం మాస్టర్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×