Covid 19 is Coming Back: దేశంలో మ ళ్లీ కోవిడ్ కలకలం రేపుతుంది. వారంలో 164 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 257 కి చేరింది. కేరళ, మహారాష్ట్రలో కొత్త కేసులు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. ఒక్క మహారాష్ట్ర లోనే 56 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఇటీవల ముంబాయ్‌లో కోవిడ్ పాసిటివ్ వచ్చిన ఇద్దరు చనిపోయారు. ఇందులో ఒకరు 60 ఏళ్ల వృద్దురాలు కాగా మరోకరు 14 ఏళ్ల బాలిక. అయితే వృద్దురాలు క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. బాలికకు కిడ్నీ సమస్య ఉంది. విరిద్దరు కోవిడ్ వల్లే చనిపోయినట్లు డేత్ సర్టిఫికెట్లలో ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ కోవిడ్ ప్రోటో కాల్‌తో అంత్యక్రియలు నిర్వహించారు అధికారులు. ఇటు హాంకాంగ్, సింగపూర్‌లో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. సింగపూర్‌లో వారంలోనే 14 వేయిల 200 కేసులు నమోదవ్వడం ఆందోళనకరంగా మారింది.
కరోనా ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజ్రంభిస్తుంది. అటు హాంకాంగ్, సింగపూర్, చైనా ఇటు భారత్‌లో రోజు రోజూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం భారత్‌లో 257 కేసులు నమోదయయ్యాని తెలిపారు. ఈ ఇన్‌ఫెక్షన్స్ కూడా రోజురోజూకు ఎక్కువవుతున్నాయి. అయితే హాంకాంగ్ లో ఇటీవల జరిగిన ఒక పెస్టివల్ తర్వాత అక్కడ కేసులు ఎక్కువయ్యాయని తెలిపారు. గతంలో ఏవిధంగా కరోనా కేసులు నమోదవుతున్నాయో.. అలాగే ఇప్పుడు కూడా అదేవిధంగా కేసుల తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. సింగపూర్ లో కరోనా టెస్ట్ చేయించుకునే వారి సంఖ్య ఎక్కువయ్యింది. దాంట్లో భాగంగా సింగపూర్‌లో గత వారం కరోనా కేసుల సంఖ్య 14,200 నమోదయ్యాయి. కొంతమంది ఐసియులో ట్రిట్ మెంట్ పోందుతున్నారు.
Also Read: జ్యోతి మల్హోత్రాపై చైనా బ్యాన్..? ఇంతకీ ఆ దేశంలో ఈమె ఏం చేసింది..?
అయితే కరోనా వల్ల 81 కేసులు ఎక్కువ తీవ్రత ఉండటం వల్ల వారిలో 30 మంది చనిపోయినట్లు తెలిపారు. ఇక భారత్ విషయానికి వస్తే.. 2020 లో కరోనా మహామ్మారి భారత్‌లో ప్రవేశించింది. అప్పుడు ఏ విధంగా ప్రజలందరికి నష్టాన్ని మిగిల్చిందో అందరికి తెలుసు. దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని భారత్ ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది. 2020లో కరోనా వచ్చిన తర్వాత చాలా మంది కుటుంబాలు ఆనాథలు అయిన పరిస్థితి కనిపించింది. అయితే అదే పరిస్థితి మళ్లి రివర్స్ కాకుండా ఉండాలంటే మాత్రం వ్యక్తిగత జాగ్రత్తలు చాలా అవసరం అని హెచ్చరిస్తున్నారు.
మళ్లీ కరోనా వస్తుంది కాబట్టి.. అందరు ఎక్కడికి వెళ్లిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ తప్పనిసరిగా వాడాలి.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ కుటుంబానికి నష్టం ఉండదు. దీంతో చాలా మందికి మంచి జరుగుతుంది. ఎవరైతే అజాగ్రత్త వహిస్తారో వారి వల్ల వారి చుట్టు పక్కల వారికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. గత పరిణామాలను గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయితే కరోనా రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారికి కరోనా అనేది ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే ఈ వ్యాధి వృద్ధులు, చిన్న పిల్లల్లో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ వారు చెబుతున్నారు.