BigTV English
Advertisement

War 2 : ‘వార్ 2’ కు తెలుగులో లెక్కలు మారినట్లే.. టార్గెట్ ఎన్ని కోట్లంటే..?

War 2 : ‘వార్ 2’ కు తెలుగులో లెక్కలు మారినట్లే.. టార్గెట్ ఎన్ని కోట్లంటే..?

War 2 : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ సినిమా కావడంతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.. తెలుగులో ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందనే టాక్ నెట్టింట ప్రచారంలో ఉంది. తాజాగా తెలుగు రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. భారీ ధరలకే కొనుగోలు జరిగినట్లు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..


‘వార్ 2’ తెలుగులో ఓన్ రిలీజ్..

RRR తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. ఆయన చేస్తున్న సినిమాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఇటీవల వచ్చిన దేవర మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వార్ 2 కూడా అంతకు మించి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా పై ఇటు తెలుగులో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో తారక్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో బిజినెస్ కూడా భారీ స్థాయిలోని జరుపుకోబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల విషయంలో తెలుగు వారికి నిర్మాతలు షాకిచ్చారు. ఈ సినిమాని బయ్యర్ల చేతికి వెళ్లకుండా తెలుగులో ఓన్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.


Also Read :అల్లు అర్జున్ – అట్లీ మూవీ బిగ్ అప్డేట్ వచ్చేసింది..ఫ్యాన్స్ కు జాతరే..!

బయ్యర్లకు యష్ రాజ్ ఫిలిమ్స్ బిగ్ షాక్..!

ఎన్టీఆర్ సినిమాను ఎంత ధర అయిన కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని బయ్యర్లు కొనుగోలు చేసి లాభాలు అందుకోవాలని ఆశిస్తున్న తరుణంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బయ్యర్ల ఆశలపై నీరు చల్లడంతో వారి ఆశలు కాస్త నిరాశలుగానే మిగిలాయి.. తెలుగు రాష్ట్రాల నిర్మాతలు స్వంతంగా విడుదల చెయ్యనున్నారు. బిజినెస్ డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి హక్కులు రూ.5.4 కోట్లు, ఆంధ్రా రూ.35 కోట్లు, మొత్తం తెలుగులో బ్రేక్‌ఈవెన్ రూ. 90 కోట్లు వసూల్ చెయ్యాలి.. భారీ సంఖ్యలో, ప్రత్యేకించి ఇది సాధారణ తెలుగు చిత్రం కాదు. YRFలో బ్రాండ్ పుల్ లేకపోవడంతో  మొత్తం క్రేజ్ ఎన్టీఆర్‌పై ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×