BigTV English

AA22 : అల్లు అర్జున్ – అట్లీ మూవీ బిగ్ అప్డేట్ వచ్చేసింది..ఫ్యాన్స్ కు జాతరే..!

AA22 : అల్లు అర్జున్ – అట్లీ మూవీ బిగ్ అప్డేట్ వచ్చేసింది..ఫ్యాన్స్ కు జాతరే..!

AA22 Movie Update : టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. వివాదాలు చుట్టిముట్టిన రికార్డులు మాత్రం ఆగలేదు. వరుసగా అన్ని ఏరియాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించాడు అల్లు అర్జున్.. ఆ మూవీ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. నేడు ఈమూవీ పూజాకార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం. మరి ఎవరు రాబోతున్నారో పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..


AA22 షూటింగ్ షురూ..!

అల్లు అర్జున్ ఈ మధ్య మాస్ యాక్షన్ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. పుష్ప సినిమాలతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇప్పుడు కొత్త మూవీతో అంతకు మించి చూపించేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ ను టీమ్ అనౌన్స్ చేసింది. నేడే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు.


ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు ఒక ఆసక్తికర పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో ఒక వ్యక్తి ఖడ్గం పట్టుకొని ఉన్నట్లు చూపించారు. ఇది సినిమాకు సంబంధించిన యాక్షన్ టోన్‌ను సూచిస్తోంది అని బన్నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్టర్ ను చూస్తే యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సుకుమార్, త్రివిక్రమ్, అల్లుఅరవింద్ లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే నేడు వెలువడనున్న ప్రకటనపై భారీ ఉత్కంఠ నెలకొంది. ఇది అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అవుతుందా? లేక అట్లీ దర్శకత్వ శైలికి తగ్గట్టు ప్రత్యేకమైన వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది..

అల్లు అర్జున్ – అట్లీ పాన్ పాన్ వరల్డ్ లోకి దీపికా..!

ఈ మూవీలో హీరోయిన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొద్ది రోజులుగా అనేక మంది పేర్లు తెరపై వినిపించాయి. కానీ ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే పేరు ప్రచారంలో ఉంది. దీపికా పడుకొణె ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్.. గతంలో అట్లీతో “జవాన్” సినిమాలో పనిచేసిన దీపికా, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించడం ద్వారా తెలుగు సినిమాలో మరోసారి తన సత్తా చాటనుంది. ఇందులో, మృణాల్ ఠాకూర్ మరియు జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు.. అయితే ప్రస్తుతం దీపికా పేరు మాత్రమే వినిపిస్తుంది. దీపికా ఈ సినిమా కోసం ప్రత్యేకమైన లుక్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ దాదాపుగా 800 కోట్లతో నిర్మించనున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×