BigTV English

Nidhi Agarwal: హీరోతో ప్రేమాయణం.. చేతురాలా జీవితాన్ని పాడు చేసుకుందా..?

Nidhi Agarwal: హీరోతో ప్రేమాయణం.. చేతురాలా జీవితాన్ని పాడు చేసుకుందా..?

Nidhi Agarwal: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. అందాల తారగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.. అయితే ఈమె నటించిన సినిమాల్లో ఒక్క ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగిలిన సినిమాలు అంతగా క్రేజ్ ను అందివ్వలేదు. అయితే ఆ మధ్య తమిళ్ లో సినిమాలు చేసిన ఈమె స్టార్ హీరోతో ప్రేమలో పడిందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఆ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే తాజాగా ఆమె హీరో ప్రేమలో పడి తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలేమైందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


హీరోతో నిధి ప్రేమాయణం.. 

కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్లే బాయ్‌ ఇమేజ్ ఉన్న శింబుతో నిధి ప్రేమాయణం నడిపిస్తోందని గతంలోనే చాలా రకాల వార్తలు రాగా, ‘హీరో’ సినిమా ఈవెంట్‌లో వీటిపై రియాక్ట్ అవుతూ అలాంటిదేమీ లేదని చెప్పింది నిధి. కానీ ఈ మధ్య వీరిద్దరి యవ్వారం గురించి మరోసారి హాట్ టాపిక్ నడుస్తుంది. అంతేకాదు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఇద్దరి మ్యారేజ్ కానుందని తెలుస్తోంది.. నిధి అగర్వాల్ ఇప్పటికే టి నగర్‌లోని శింబు ఇంటికి మకాం మార్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఇరు కుటుంబాలను ఒప్పించే పనిలో ఉన్నారట. వీరి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. అయితే అతని ప్రేమలో పడిన తర్వాత కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా చేస్తుందని తాజాగా ఓ న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందనే టాక్ ను అందుకుంది. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు చూద్దాం..


బెట్టింగ్ ప్రమోషన్లో నిధి అగర్వాల్.. 

సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. సెలెబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం పై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. ఇప్పటికే ఇండస్ట్రీ లోని 11 మంది సెలెబ్రిటీలపై కేసులు నమోదు చేసారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కుర్ర హీరోయిన్ వచ్చి చేరింది. గతం లో ఈమె ‘jeetWin’ అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా లో బాగా వైరల్ చేస్తున్నారు నెటిజెన్స్. ఈమెపై కూడా కేసు ని నమోదు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.. ఈ పోలీసులు ఏమని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సింది..

Also Read : సర్జరీల కోసం లక్షలు వదులుకున్న స్టార్ హీరోయిన్లు.. ఎవరెవ్వరో తెలుసా..?

సినిమాల విషయానికొస్తే… 

ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో, అదే విధంగా ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.. వీటితోపాటు తమిళ్లో పలు చిత్రాల్లో నటిస్తుందని తెలుస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×