Allu Arjun Comments : స్టైలీష్ స్టార్ అనే అల్లు అర్జున్ ఇప్పుడు ఐకన్ స్టార్‌గా మారాడు. ఈ నేమ్ ట్యాగ్ మారడంపై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆరోపణలు చేశారు. అది పక్కన పెడితే, తన సక్సెస్ గురించి, ఐకన్ స్టార్ అవ్వడానికి కారణాలు ఏంటో అల్లు అర్జున్ ఇటీవల వెల్లడించాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ ఇప్పుడు ఐకన్ స్టార్ కానీ, ఆయన మాత్రం మెగా కంపౌండ్ నుంచి వచ్చిన హీరోనే అని అంటారు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి సపొర్ట్‌తో ప్రతి ఏడాది ఒక్కో సినిమా చేస్తూ, వచ్చాడు. కానీ, అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ ఫెయిల్ మూవీ పడింది. అదే… నా పేరు సూర్య. డీజే లాంటి మూవీ తర్వాత వచ్చిన ఈ మూవీకి మిక్సిడ్ టాక్ రావడమే కాకుండా… అల్లు అర్జున్ ఫర్మామెన్స్‌పై ట్రోల్స్ కూడా వచ్చాయి.
ఇదే అల్లు అర్జున్‌ను మొత్తం మార్చేసిందట. మార్చేసిందట. ఈ సినిమా తర్వాత దాదాపు 6 నెలల పాటు ఇంట్లోనే ఉన్నాడట. అంతే కాదు… తన కెరీర్‌లోనే ఫస్ట్ టైం ఒక ఏడాది అసలు సినిమాలేవీ తీయకుండా ఉన్నాడట.
ఈ నెలల పాటు ఎవరీ మాట వినకుండా, తన మాటే విన్నాడట. తనతో తానే మాట్లాడుకోవడం నేర్చుకున్నాడట. నిర్ణయాలను స్వయంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నాడట. అంతరాత్మను మించిన గురువు ఎవరూ లేరు అనేదాన్ని తెలుసుకున్నాడట బన్నీ. అలా.. తనను తానే తీర్చిదిద్దుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవల Waves Summit – 2025 లో చెప్పాడు.
ఇలా మారిన తర్వాతే.. తనకు అలా వైకుంఠపూరములో… పుష్ప 1, పుష్ప 2 లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వచ్చాయని, సక్సెస్ మంత్ర తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు.
మెగా ఫ్యాన్స్‌ను మళ్లీ కెలికాడా..?
అంతా బానే ఉంది.. కానీ, ఇక్కడ పక్క వారి మాటలు వినడం మానేశాని, తనకు ఎవరు గురువులు లేరు అంటూ బన్నీ చెప్పన డైలాగ్స్ ఎవరిని ఉద్దేశించి అనేది ఇప్పుడు మరోసారి హట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించే అన్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. ఇప్పుడు ఐకన్ స్టార్ అయినా… కెరీర్ ఇచ్చింది మాత్రం గుర్తు పెట్టుకోవాలి అంటూ కౌంటర్స్ వేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అలాగే, పవన్ కళ్యాణ్ పలు స్టేజీలపై చెప్పిన ‘మూలాలను మర్చిపోవద్దు’ అనే మాటలను కూడా మెగా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం మెగా కంపౌండ్ కి బన్నీ పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. బర్త్ డే విషెస్ కూడా వీరు చెప్పుకోవడం లేదు. దీనికి చాలా రోజుల ముందు నుంచే… బన్నీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు Waves Summit – 2025 లో అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి అని ఇటు సోషల్ మీడియాలో, అటు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. AA22*A6 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చింది.