Retro Movie Collections : సూర్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఏరోజు అలా చూడలేదు. సూర్య సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.అలానే సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. సూర్య కెరియర్లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో సూర్య సూపర్ హిట్ సినిమా చేసి చాలా ఏళ్లయింది. సూర్య నటించిన ఆకాశమే హద్దురా, జై భీమ్ వంటి సినిమాలు ఓటిటిలో విడుదలై మంచి ఆదరణను పొందుకున్నాయి. అయితే థియేటర్లో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రం ఆడియన్స్ ను నిరాశ పరుస్తూనే ఉంది.
డిజాస్టర్ కంగువ
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన శివ తర్వాత దర్శకుడుగా మారిపోయాడు. ఆ తర్వాత తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అజిత్ లాంటి హీరోలకు వరుస సూపర్ హిట్ సినిమాలను అందించాడు శివ. ఆ తర్వాత రజినీకాంత్ లాంటి హీరోతో కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. సూర్య హీరోగా కంగువ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేశారు. ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇది ఒక తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ బాహుబలి అని చెబుతూ వచ్చాడు, అలానే 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని కూడా చెప్పారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ సొంతం చేసుకుంది.
Also Read : Janu Lyri Missing : జాను ఎక్కడా..? సుసైడ్ స్టెట్మెంట్ తర్వాత ఏమైపోయింది..?
రెట్రో ఫెయిల్యూర్
కార్తీక్ సుబ్బరాజు సినిమా అంటేనే కొన్ని అంచనాలు ఉంటాయి. అంతేకాకుండా కార్తీక్ సుబ్బరాజు కు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టెక్నికల్ గా కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు బ్రిలియంట్ గా అనిపిస్తాయి. ఇక కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో సినిమా కూడా మంచి అంచనాలతో విడుదలైంది. కార్తీక్ లైఫ్ లో మొదటిసారి లవ్ స్టోరీ చేస్తున్న అని ఈ సినిమాను ప్రమోట్ చేశాడు. అయితే తమిళ్లో ఈ సినిమా కొంతమేరకు పరవాలేదు గానీ తెలుగులో కంప్లీట్ నెగిటివ్ టాక్ వస్తుంది. ఇంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్లను వసూలు చేసింది. ఫ్లాప్ టాక్ తో కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే, ఆ క్రెడిట్ కంప్లీట్ గా సూర్యకి ఇవ్వచ్చు.
Also Read : Kamal Kamaraj: తెలుగు హీరోలకు ముస్లిం పాత్రలు రాయరు… ఎందుకని ఆలోచించారా.?