BigTV English

Trolls on SRH: ప్రాక్టీస్ చేయమంటే, మాల్దీవ్స్ వెళతారా.. బాలయ్య వార్నింగ్ !

Trolls on SRH:  ప్రాక్టీస్ చేయమంటే, మాల్దీవ్స్ వెళతారా.. బాలయ్య వార్నింగ్ !

Trolls on SRH:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…. ఇప్పటివరకు 50 మ్యాచ్లకు పైగా పూర్తయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. శుక్రవారం రోజున గెలుస్తుంది అనుకున్న హైదరాబాద్ జట్టు దారుణంగా ఓడిపోయింది. గుజరాత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి… ప్లే ఆఫ్ ఆశలను మరింత కఠిన తరం చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది హైదరాబాద్.


Also Read: SRH Playoff: కావ్య పాప మాస్టర్ ప్లాన్…. ఇదే జరిగితే నేరుగా ప్లే ఆఫ్స్ కు SRH

హైదరాబాద్ జట్టుకు బాలయ్య వార్నింగ్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ జట్టు ఓడిపోయిన నేపథ్యంలో బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెన్నై పైన విజయం సాధించిన తర్వాత ప్రాక్టీస్ చేయాల్సింది పోయి.. మాల్దీవ్స్… ట్రిప్పు ఎందుకు వెళ్లారు అని… నందమూరి బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి నందమూరి బాలయ్య… హైదరాబాద్ ప్లేయర్లను ఉద్దేశించి… వార్నింగ్ ఇవ్వలేదు. కానీ కొంతమంది హైదరాబాద్ ఫ్యాన్స్… నందమూరి బాలయ్య డైలాగులు వాడుకొని…. SRH ప్లేయర్లకు వార్నింగ్ ఇస్తున్నారు. బోయపాటి అలాగే నందమూరి బాలయ్య చేసిన ఓ సినిమాలోని డైలాగును… వాడుకొని హైదరాబాద్ ప్లేయర్లకు కౌంటర్ ఇస్తున్నారు క్రికెట్ అభిమానులు.

హైదరాబాద్ ఓడిపోయిన నేపథ్యంలో స్వయంగా బాలయ్య వచ్చి వాళ్లకు వార్నింగ్ ఇచ్చినట్లు… వాళ్లపై దాడి చేసినట్లు.. దారుణంగా సెటైర్లు పేల్చుతున్నారు. బాలయ్య డైలాగ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రకరకాల సినిమాలు డైలాగులు పెట్టి మరి ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. చెన్నై సూపర్ జట్టును చిత్తు చేసిన తర్వాత… మాల్దీవ్స్ కు ఎందుకు హైదరాబాద్ జట్టు వెళ్ళింది.. అక్కడికి వెళ్లకుండా ప్రాక్టీస్ చేస్తే బాగుండేది అని క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అసలు కావ్య పాపకు బుద్ధి లేదని మరికొంతమంది ఆమెపై ఫైర్ అవుతున్నారు.

ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం హైదరాబాద్ కు ఇంకా ఉందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు ఇంకా ఉన్నాయా అని అందరూ చర్చిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో కచ్చితంగా అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్లలో కచ్చితంగా హైదరాబాద్ ప్రతి మ్యాచ్ గెలవాలి. అలా గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. లేకపోతే టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది హైదరాబాద్. వరుసగా నాలుగు మ్యాచ్లలో విజయం చేస్తే 14 పాయింట్లు వస్తాయి. అదే సమయంలో రన్ రేట్ కూడా పెంచుకోవాలి అప్పుడే గతంలో రాయల్ చాలెంజర్స్ ప్లే ఆఫ్ కి వెళ్లినట్లు హైదరాబాద్ వెళ్తుంది.

Also Read: SRH VS GT Match: IPL 2025 నుంచి SRH ఎలిమినేట్.. ముంబై ఇండియన్స్ ప్లేయర్‌పై రేప్ కేసు

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×