Actress Kalpika : టాలీవుడ్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్ చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకున్న యాక్టర్లలో నటి కల్పిక ఒకరు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమధ్య సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ తాజాగా వార్తల్లో హైలెట్ అవుతుంది. కల్పిక ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన ఫ్రెండ్స్ తో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కు వెళ్ళింది.. ఆమెకు పబ్ నిర్వాహకులకు మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను ఆమెనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే తాజాగా ఈ ఇష్యూ పై పోలీసులు స్పందించినట్లు తెలుస్తుంది.. వాళ్లు ఏమన్నారంటే..
కల్పిక పై పబ్ లో దాడి..
నటి కల్పిక బర్త్ డే సందర్బంగా ప్రిజం పబ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. అక్కడ బర్త్ డే కేకు విషయంలో ఆమెకు, పబ్ నిర్వాహకుల మధ్య చిన్న గొడవ జరిగింది. బర్త్ డే కేక్ ను తీసుకురావడం గురించి పబ్ సిబ్బంది, కల్పిక మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వీడియోను పోస్ట్ చేసి, పబ్ నిర్వాహకులు తనపై దురుసుగా ప్రవర్తించారు అని, అలాగే బూతులు తిట్టారని ఆమె ఆరోపించింది. ఆ సమయంలో తనను డ్రగ్గిస్ట్ అంటూ అవమానించారని ఆరోపణలు చేసింది కల్పిక. తన గౌరవం దెబ్బతిందని, మానసికంగా సైతం వేదన చెందినట్టు సోషల్ మీడియాలో తెలిపింది..
పబ్ మేనేజ్మెంట్ పై కల్పిక పోలీసులకు ఫిర్యాదు..
పబ్ లో తనకు అవమానం జరిగిందని నటి కల్పిక సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మాత్రం తాము కల్పిక నుంచి ఫిర్యాదు అందుకున్నట్లు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి కల్పిక, పబ్ మేనేజ్మెంట్ మధ్య ఘర్షణ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు.. ఈ విషయం పై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెబుతున్నారు.
Also Read :మాసోడి కొత్త సినిమాకు క్లాస్ టైటిల్.. వర్కౌట్ అవుతుందా..?
సినిమాల విషయానికొస్తే..
2009లో తన యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసింది. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా లో జెనీలియా స్నేహితురాలిగా నటించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.. ఆ తర్వాత జులాయి,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది.. కొద్ది రోజులుగా ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గాయి. అడపాదడపా సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేస్తోంది. కానీ పెద్దగా క్రేజ్ రాలేదని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ పబ్ న్యూస్ వల్ల వార్తల్లో ఈమె పేరు హైలెట్గా నిలిచింది. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి..